logo

442 గ్రామాలు.. 2,22,855 ఇళ్లు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా అధికారులు నూతన అంకానికి శ్రీకారం చుడుతున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.

Updated : 01 Jun 2023 03:40 IST

చింతకాని మండలం సీతంపేటలో సర్వే చేస్తున్న బోనకల్లు ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్‌, సిబ్బంది

వైరా, న్యూస్‌టుడే: స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా అధికారులు నూతన అంకానికి శ్రీకారం చుడుతున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. జూన్‌ మూడో వారం నాటికి సర్వే పూర్తి చేసి ప్రత్యేక పోర్టల్‌లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద   నివేదించాలని ప్రభుత్వం నుంచి  ఆదేశాలు వెలువడ్డాయి.

జంబ్లింగ్‌ పద్ధతిలో..

మండలాల వారీగా  ఎంపిక చేసిన ఓడీఎఫ్‌ ప్లస్‌ మోడల్‌ గ్రామాల్లో జంబ్లింగ్‌ పద్ధతిలో సిబ్బందిని కేటాయించారు. దీని కోసం మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవో ఆధ్వర్యంలోని బృందంతో సర్వే చేయిస్తున్నారు. ఆయా బృందాలకు ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీల్లో పనిచేసే మల్టిపర్పస్‌ కార్మికులు చేదోడుగా నిలుస్తున్నారు. ఒక మండలం సిబ్బందిని మరో మండలంలో నియమించి సర్వే చేయిస్తున్నారు. ఉదాహరణకు బోనకల్లు  మండల పరిషత్తు అధికారులు, కార్యదర్శులు ఇతర సిబ్బందిని చింతకాని మండలంలో సర్వే చేయిస్తుండగా వైరా మండలం ఎంపీడీవో బృందాన్ని కొణిజర్ల, ఖమ్మం రూరల్‌ మండలానికి నియమించారు. తల్లాడ మండల సిబ్బందిని ఏన్కూరు, ఖమ్మం రూరల్‌కు కేటాయించారు.

గత ఆగస్టులో మొదటి దఫా.. ఇప్పుడు రెండో దఫా

గతేడాది ఆగస్టులో ఎంపిక చేసిన 147 గ్రామ పంచాయతీల్లోని 75 వేల ఇళ్లలో మొదటి దఫా సర్వే పూర్తి చేశారు. తాజాగా రెండో దఫా సర్వేలో 442 గ్రామ పంచాయతీల్లోని 2,22,855 ఇళ్లల్లో ఆయా అంశాలపై సర్వే చేయనున్నారు. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది. ఈ వేడుకల్లో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులే కీలకంగా వ్యవహరించనున్నారు. ఒకేసారి దశాబ్ది ఉత్సవాలతో పాటు సర్వే చేయాల్సి రావడం భారంగా మారిందని మండల పరిషత్తు సిబ్బంది వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని