logo

రైతు వేదికలను విద్యుద్దీపాలతో అలంకరించండి: కలెక్టర్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు వేదికలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Published : 02 Jun 2023 04:08 IST

దశాబ్ది ఉత్సవాల ప్రచార గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, సీఈఓ అప్పారావు, డీఏఓ విజయనిర్మల తదితరులు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు వేదికలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతు దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరపాలన్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులను సమీకరించాలని, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై ప్రదర్శనగా రైతు వేదికలకు చేరుకోవాలని సూచించారు. రైతుబంధు, రైతుబీమా పథకాల లబ్ధిదారులతో మాట్లాడించాలని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్‌ స్నేహలత, జడ్పీ సీఈఓ వింజం అప్పారావు, డీఏఓ విజయనిర్మల, ఏడీఏ సరిత తదితరులు పాల్గొన్నారు.

అనువైన భూములు గుర్తించాలి: అర్హులకు ఇళ్ల స్థలం(75 గజాలు) అందించేందుకు అనువైన భూములు గుర్తించి, పంపిణీ చేయా’లని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అర్హుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలన్నారు. ఈనెల 9న నియోజకవర్గ స్థాయిలో పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీటీ రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.
నేడు జెండావిష్కరణ: ఖమ్మం నగరం: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయజెండాను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని వివరించనున్నారు.   ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి పువ్వాడ గురువారం శుభాకాంక్షలు తెలిపారు.

రఘునాథపాలెం: రఘునాథపాలెంలో తహసీల్‌ కార్యాలయం, పోలీసు స్టేషన్‌ భవనాల నిర్మాణ పనులను కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ పరిశీలించారు. ఈనెల 10న భవనాలను ప్రారంభిస్తామని కలెక్టర్‌ తెలిపారు. శిక్షణ కలెక్టరు మయాంక్‌సింగ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ కేవీకే శ్రీనివాస్‌, తహసీల్దారు నరసింహారావు, ఎంపీడీఓ రామకృష్ణ, ఏసీపీ బస్వారెడ్డి, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని