logo

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు జీవనరక్ష పురస్కారం

రైల్వే ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడడంలో కీలక భూమిక పోషించిన ఖమ్మం రైల్వేస్టేషన్‌ ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శివానికి జీవనరక్ష అవార్డును ప్రకటించారు.

Updated : 02 Jun 2023 05:17 IST

కానిస్టేబుల్‌ శివాని

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: రైల్వే ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడడంలో కీలక భూమిక పోషించిన ఖమ్మం రైల్వేస్టేషన్‌ ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శివానికి జీవనరక్ష అవార్డును ప్రకటించారు. ఈ మేరకు ద.మ. రైల్వే ఆర్పీఎఫ్‌ సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌   దేబస్మిత సి బెనర్జీ గురువారం వెల్లడించారు. మే 31న ఖమ్మం రైల్వేస్టేషన్‌లో మధిరకు వెళ్లేందుకు కిక్కిరిసిపోయిన ఇంటర్‌సిటీ రైలు ఎక్కేందుకు ప్రయాణికురాలు కృష్ణవేణి ప్రయత్నిస్తుండగా, కాలు జారి ప్లాట్‌ఫాం, రైలు మెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తక్షణమే స్పందించిన అధికారులు కొద్దిసేపు రైలును నిలిపివేశారు. కృష్ణవేణిని బయటకు లాగేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. 100 మందికిపైగా ప్రయాణికులు, పోలీసులు బోగిని వెనక్కి నెడుతుంటే, ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శివాని చాకచక్యంగా క్షతగాత్రురాలిని బయటకు లాగారు. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సకాలంలో అంబులెన్సు రాకపోతే శివానియే ఆసుపత్రికి తీసుకెళ్లడంలో చొరవచూపింది. ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడడంలో శివాని చూపిన చొరవ అభినందనీయమని దేబస్మిత పేర్కొన్నారు. ఆమెను జీవనరక్ష పురస్కారంతో ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని