logo

ప్రయోగం ఫలించేనా...?

ఇంటర్‌ విద్యార్థులకు రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Published : 03 Jun 2023 03:32 IST

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్‌ విద్యార్థులకు రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు సైన్స్‌, వృత్తి విద్యాకోర్సుల సబ్జెక్టులకే పరిమితమైన ప్రయోగాలు తొలిసారిగా ఆంగ్లం సబ్జెక్టులోనూ అమలుచేయాలని భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష(తెలుగు)కే విద్యార్థులు ప్రాధాన్యమిస్తుండటంతో డిగ్రీలు, పీజీలు, వృత్తి విద్యాకోర్సులు అభ్యసించిన వారు సైతం ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించలేకపోతున్నారనే వాదనలున్నాయి. విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేందుకు ప్రాక్టికల్స్‌ దోహదపడతాయని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందేనా..?

90వ దశకానికి ముందున్న బోధన పద్ధతులు ఇప్పుడు లేకపోవటంతో భాషా సామర్థ్యాలపై గణనీయమైన ప్రభావం పడుతోంది. తెలుగులో వర్ణమాలతో ప్రారంభించటం మొదలుకొని వాక్యనిర్మాణం వరకు సులభమైన బోధన పద్ధతులు అనుసరించేవారు. ఆంగ్లంలోనూ తొలుత ఏబీసీడీలను నేర్పి పదోతరగతి దాకా వ్యాకరణం, వాక్యనిర్మాణంపై తర్ఫీదు ఇచ్చేవారు. ఈ విధానానికి స్వస్తి పలికి నేరుగా వాక్యనిర్మాణంపై దృష్టిపెట్టటం విద్యార్థుల్లో అయోమయాన్ని సృష్టించింది. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ చదువులు మరింత గందరగోళానికి గురిచేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో పదోతరగతి వరకు కనీస ఆంగ్ల పరిజ్ఞానంతో చదివే విద్యార్థులు.. ఇంటర్‌లో పట్టణ ప్రాంత విద్యార్థులతో ప్రాక్టికల్స్‌లో పోటీపడటం ఇబ్బందికరంగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2015 నుంచి ప్రయోగ పరికరాలు సరఫరా కావటం లేదని, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సైన్స్‌, ఒకేషనల్‌ ప్రయోగాలే సరిగ్గా జరగటం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి.

పరిశీలకులను ప్రసన్నం చేసుకుంటేనే..

ఇంటర్‌ ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. విద్యార్థులు భాషపై పట్టు సాధించేందుకు తరగతి గదుల్లో ఎక్కువ సాధన చేయించాలి. ఇంటర్‌ ప్రారంభం నుంచే ఈవిషయంపై తర్ఫీదు ఇవ్వటం మంచిది. ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రయోగ పరీక్షలు ఉపయోగపడతాయి.

కేఎస్‌ రామారావు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌

అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం

ఇంటర్‌ ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. విద్యార్థులు భాషపై పట్టు సాధించేందుకు తరగతి గదుల్లో ఎక్కువ సాధన చేయించాలి. ఇంటర్‌ ప్రారంభం నుంచే ఈవిషయంపై తర్ఫీదు ఇవ్వటం మంచిది. ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రయోగ పరీక్షలు ఉపయోగపడతాయి.

కేఎస్‌ రామారావు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని