logo

సైకోల మాటలు సత్తుపల్లి ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే సండ్ర

సైకోల మాయమాటలు సత్తుపల్లి ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 03 Jun 2023 03:32 IST

సత్తుపల్లి, న్యూస్‌టుడే: సైకోల మాయమాటలు సత్తుపల్లి ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు ప్రభుత్వం ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు వద్ద వెయ్యి గజాల స్థలాన్ని కట్టబెట్టినట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఇప్పటి వరకు తనకు అధికారికంగా ఇవ్వలేదని చెప్పారు. 1994లో ఎన్టీఆర్‌ నివాస గృహం కోసం తనకు కేటాయించారని ఇప్పటికీ తాను సదరు క్వార్టర్‌కు అద్దె చెల్లిస్తున్నట్లు వివరించారు. గతంలో పది వేల గజాలు మమత ఎడ్యుకేషనల్‌ సొసైటీకి, హార్వెస్ట్‌, నిర్మల్‌ హృదయ్‌ స్కూల్‌కు ప్రభుత్వం భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు భూమి ఇవ్వడం ఏదో నేరం, ఘోరం అయినట్లు, దేశంలో తనకొక్కడికే భూములు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అది సరైంది కాదని హితవుపలికారు. అనంతరం 3 నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై వివరించారు. ఈ సమావేశంలో పుర, జిల్లా గ్రంథాలయ, ఆత్మ ఛైర్మన్లు కూసంపూడి మహేశ్‌, కొత్తూరు ఉమామహేశ్వరరావు, వనమా వాసు, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, గ్రాండ్‌మౌలాలీ, కౌన్సిలర్లు, భారాస నాయకులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని