logo

ఖమ్మం.. నిప్పుల గుండం

ఆకాశం నుంచి సూర్యుడు శుక్రవారం నిప్పులు కురిపించడంతో జిల్లా అగ్నిగుండంగా మారింది. రాష్ట్రంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత నల్గొండ జిల్లా దామరచర్లలో 46.8 డిగ్రీలు నమోదవగా తరువాతి స్థానంలో నేలకొండపల్లిలో 46.6 డిగ్రీలు నమోదైంది.

Updated : 03 Jun 2023 06:20 IST

నేలకొండపల్లిలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఆకాశం నుంచి సూర్యుడు శుక్రవారం నిప్పులు కురిపించడంతో జిల్లా అగ్నిగుండంగా మారింది. రాష్ట్రంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత నల్గొండ జిల్లా దామరచర్లలో 46.8 డిగ్రీలు నమోదవగా తరువాతి స్థానంలో నేలకొండపల్లిలో 46.6 డిగ్రీలు నమోదైంది. ముదిగొండ మండలం బాణాపురం, పమ్మిలో 46.3 డిగ్రీలు, ఖమ్మంలోని ఖానాపురం హవేలి పోలీస్‌ స్టేషన్‌లో 45.2, సత్తుపల్లిలో 45.1 డిగ్రీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జిల్లాలోని మిగతా అన్ని మండలాల్లోని ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లలో 41 డిగ్రీల నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతకాని మండలం నాగులవంచ, ముదిగొండ, ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడెంలో 44.9 డిగ్రీలు నమోదైంది. జిల్లావ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరగటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లపై జన సంచారం తగ్గిపోయింది. మధ్యాహ్నం సమయంలో చాలా దుకాణాలు మూతపడ్డాయి. పగటి వేళ ఏసీల వినియోగం పెరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ శుక్రవారం ఎండ దంచి కొట్టింది. పాల్వంచ మండలం యానంబైలులో 45.4, కరకగూడెంలో 45.2, మణుగూరులో 45.1, దమ్మపేట మండలం నాయుడుపేటలో 44.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని అన్ని ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లలో 40.7 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యుడి ప్రతాపానికి జన జీవనం జనం అల్లాడిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని