logo

గురుతర బాధ్యత

సర్కారు బడిలో విద్యార్థుల ప్రతిభకు పదును పెడుతున్నారు. ఉత్తమ బోధన, ప్రత్యేక శిక్షణతో గురుకులాల ప్రవేశ పరీక్షల్లో ఏటా పది మందికిపైగా సీట్లు సాధిస్తున్నారు.

Published : 04 Jun 2023 02:23 IST

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే

గురుకులాల్లో సీట్లు సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు

సర్కారు బడిలో విద్యార్థుల ప్రతిభకు పదును పెడుతున్నారు. ఉత్తమ బోధన, ప్రత్యేక శిక్షణతో గురుకులాల ప్రవేశ పరీక్షల్లో ఏటా పది మందికిపైగా సీట్లు సాధిస్తున్నారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడి కృషి ఎంతో ఉంది. ఇదీ మండలంలోని నరసింహాపురం ప్రాథమిక పాఠశాల ఘనత.. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందిన ప్రధానోపాధ్యాయుడు మద్దిరెడ్డి నాగేశ్వరరెడ్డి ఈ పాఠశాలకు 2018 జులైలో బదిలీపై వచ్చారు. నాటి నుంచి గురుకులాల్లో సీట్లు సాధించడమే లక్ష్యంగా నాలుగో తరగతికి చెందిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం గురుకుల ప్రవేశ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు పొంది సీట్లు సాధించేలా కృషి చేస్తున్నారు. అయిదు తరగతులున్న ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, మొత్తం 60 మంది విద్యార్థులున్నారు. అయిదేళ్లలో పాఠశాల నుంచి 70 మంది వివిధ ప్రవేశాలు పొందడం విశేషం.

* విద్యార్థులకు రెగ్యులర్‌ తరగతులతో పాటు, గురుకుల ప్రవేశ పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక శిక్షణ ఇవ్వటంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ఇందులో తల్లిదండ్రులు, గ్రామస్థుల సహకారం మరువలేనిది. 

ఎంపికైన విద్యార్థులు

201819         16
201920        14
202021         09
202122         15
202223        15

మద్దిరెడ్డి నాగేశ్వరరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని