logo

నిమిషంలోనే భూసార పరీక్ష ఫలితాలు

కాన్పూరు ఐఐటీ విద్యార్థులు రూపొందించిన భూసార పరీక్షా పరికరాన్ని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అశ్వారావుపేటలో విడుదల చేశారు.

Published : 04 Jun 2023 02:23 IST

పరీక్ష కిట్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మెచ్చా, పక్కన ఏడీ సయ్యద్‌ అహ్మద్‌ హుస్సేన్‌

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: కాన్పూరు ఐఐటీ విద్యార్థులు రూపొందించిన భూసార పరీక్షా పరికరాన్ని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అశ్వారావుపేటలో విడుదల చేశారు. ఈ పరికరాన్ని వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతు సదస్సులో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, వ్యవసాయ కళాశాల ఏడీ సయ్యద్‌ అహ్మద్‌ హుస్సేన్‌ కాన్పూరు ఐఐటీ, ఏరిస్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. మట్టినమూనాలను అప్పటికప్పుడు పరీక్షించి ఏఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో నిమిషం వ్యవధిలోనే తెలుసుకోవచ్చు. ఇటీవల కాన్పూరు ఐఐటీ విద్యార్థులు తయారు చేసిన ఈ పరికరాన్ని వ్యవసాయ కళాశాలలో ప్రదర్శించారు. రైతు చరవాణితో దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో రైతు వ్యవసాయ క్షేత్రం మ్యాపింగ్‌, సేకరించిన మట్టి, రైతు పేరు, గ్రామంతో పాటు పరీక్షించిన మట్టిలో ఏఏ పోషకాలున్నాయో వెంటనే చరవాణికి సమాచారం వస్తోంది. ఏరిస్‌ ప్రతినిధులు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని