తెలంగాణలో రాజకీయంగా మాదిగలకు అన్యాయం: మంద కృష్ణమాదిగ
తెలంగాణలో రాజకీయంగా మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ
తల్లాడ, న్యూస్‌టుడే: తెలంగాణలో రాజకీయంగా మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తల్లాడలో శనివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 19శాతం ఉన్న మాదిగలకు ఒక మంత్రి పదవి లేదని, అగ్రవర్ణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అగ్రవర్ణాలు అధికంగా ఉండడంతో ఎస్సీ వర్గీకరణ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మాదిగలు రాజకీయాల్లో రాణించాలని స్థాపించిన మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ)ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు తల్లాడ రింగురోడ్డులో ఎంఎస్‌పీ జెండాను ఆవిష్కరించారు. ఏపూరి వెంకటేశ్వరరావు, బచ్చలకూర వెంకటేశ్వరరావు, కూరపాటి సునీల్, బొర్రా భిక్షపతి, ఇస్నేపల్లి అశోక్, తాళ్ల సురేశ్, కొలికపొగు వెంకటేశ్వరరావు, నాగరాజు, సురేశ్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు