logo

కేంద్రం, రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం: పాల్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసిరావాలని ప్రధాన రాజకీయ పార్టీలు కోరుతున్నట్లు ‘ప్రజాశాంతి’ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు.

Updated : 04 Jun 2023 05:42 IST

కొత్తగూడెం పట్టణం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసిరావాలని ప్రధాన రాజకీయ పార్టీలు కోరుతున్నట్లు ‘ప్రజాశాంతి’ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. అయినా దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయా ప్రతిపాదనలు తోసిపుచ్చుతున్నట్లు చెప్పారు. ఒకవేళ కలిసొచ్చే పార్టీలతో తాము రాష్ట్ర ఎన్నికల బరిలోకి దిగితే పోటీ పక్షాల అభ్యర్థులకు డిపాజిట్లూ దక్కవని వ్యాఖ్యానించారు. కొత్తగూడెంలోని ఓ ఫంక్షన్‌ హాలులో శనివారం మాట్లాడారు. కాంగ్రెస్‌ కుటుంబ పాలనతో రాష్ట్రం దివాలా తీస్తే... ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కేంద్రంలో భాజపాదీ ఇదే తీరని మండిపడ్డారు. అంబానీ, అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టి ఊడిగం చేస్తున్నట్లు ఆరోపించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ పార్టీ నుంచి పోటీచేస్తే వచ్చే ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లో ఆయన వర్గీయులే గెలుస్తారన్నారు. ఆదివారం ఖమ్మంలో పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపిన పాల్‌.. త్వరలో కొత్తగూడెంలోనూ కొత్తగా మరొకటి నెలకొల్పుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని