సాగుకు అండగా రైతు పండుగ
పల్లె నుంచి ఎడ్లబండ్లు కదిలాయి. ట్రాక్టర్లు వరుసలు కట్టాయి. అన్నదాతలు సంబరంగా బయలుదేరారు. వీధులు వర్ణరంజితవగా అధికారులు, ప్రజాప్రతినిధుల రాకతో రైతు వేదికలు సందడిగా మారాయి.
న్యూస్‌టుడే బృందం
చింతకాని: నాగులవంచలో ఎద్దుల బండ్ల ప్రదర్శనలో పాల్గొన్న ఎంపీ నామా, ప్రజా ప్రతినిధులు
పల్లె నుంచి ఎడ్లబండ్లు కదిలాయి. ట్రాక్టర్లు వరుసలు కట్టాయి. అన్నదాతలు సంబరంగా బయలుదేరారు. వీధులు వర్ణరంజితవగా అధికారులు, ప్రజాప్రతినిధుల రాకతో రైతు వేదికలు సందడిగా మారాయి. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రెండో రోజైన శనివారం నిర్వహించిన రైతు దినోత్సవాలు అంబరాన్నంటాయి. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడ్తున్న పథకాలను ముఖ్యనేతలు వివరించారు. ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
సత్తుపల్లి: నవ ధాన్యాలతో తయారు చేసిన కేసీఆర్, సండ్ర చిత్రల వద్ద తాతా మధుసూదన్, సండ్ర
నేడు వ్యవసాయం పండగే: ఎంపీ నామా: బోనకల్లు, న్యూస్‌టుడే: చిన్నప్పటి నుంచి రైతు కష్టాలు నష్టాలు కన్నీళ్లు చాలా దగ్గరగా చూశా.. నేడు తెలంగాణలో కేసీఆర్ సుపరిపాలన వల్ల ఆ పరిస్థితి మటుమాయమైందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాయన్నపేట రైతువేదికలో ఆయన మాట్లాడారు. నాడు తెలంగాణలో సాగు, తాగు నీరు, విద్యుత్తు లేక అనేక రూపాల్లో పోరాటాలు చేశారని, ఇప్పుడు 24గంటలు విద్యుత్తు సరఫరా, సాగు, తాగు నీటిని పుష్కలంగా అందించడంతో తెలంగాణ అభివృద్ధితో నిండిపోయిందన్నారు. జడ్పీ ఛైర్మన్ కమల్‌రాజు, కొండబాల మాట్లాడారు. గ్రామంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. రైబస జిల్లా కన్వీనర్ నల్లమల, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.
మధిర గ్రామీణం: మాటూరులో ట్రాక్టర్ నడుపుతున్న కొండబాల కోటేశ్వరరావు
చింతకాని, న్యూస్‌టుడే: నాగులవంచ, చింతకాని, లచ్చగూడెం, జగన్నాథపురం రైతు వేదికల్లో ఎంపీ నామా పాల్గొని మాట్లాడారు. ప్రొద్దుటూరు, నాగిలిగొండలో కొండబాల, నల్లమల, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ కిషోర్, భారాస మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి చింతకాని మండలం రామకృష్ణాఫురం వద్ద ఎగ్జిట్ పాయింట్ ఇవ్వాలని పలువురు రైతులు, గ్రామస్థులు ఎంపీ నామాకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ధంసలాపురం వద్ద పనులను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. సమస్యను పరిష్కరిస్తానని రైతులకు నామా హామీ ఇచ్చారు.
బోనకల్లు: ముష్టికుంట్లలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష: తాతా మధు
సత్తుపల్లి, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రైతులకు శ్రీరామ రక్ష అని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో భారీ బతుకమ్మ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తాతా మధుసూదన్, ఎమ్మెల్యే సండ్ర ఫ్లెక్సీ కటౌట్లు, పంట ఉత్పత్తులతో తయారు చేసిన శకటంతో కొత్తూరు నుంచి కాకర్లపల్లి వరకు పెద్దఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కాకర్లపల్లి రైతు వేదిక స్థల దాతలు కంచర్ల సత్యనారాయణ, సత్యవతి దంపతులను అభినందించారు.
వైరా: ఖానాపురంలో అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్
సీతారామతో సస్యశ్యామలం: సండ్ర: చేసిన అభివృద్ధి చెప్పుకోకపోతే మరుగునపడిపోతుందన్నారు. అతిత్వరలోనే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. సకల జనుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న భారాస ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రజలు కొండంత అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కొత్తూరు గొడ్డేటి బాలకృష్ణ ఆధ్వర్యంలో నవధాన్యాలతో రూపొందించిన కేసీఆర్, కేటీఆర్, సండ్ర, పార్థసారథిరెడ్డి చిత్రాలను పరిశీలించి వారిని సన్మానించారు. ఆర్డీవో సూర్యనారాయణ, పుర, గ్రంథాలయ, ఆత్మ ఛైర్మన్లు మహేశ్, ఉమామహేశ్వరరావు, వనమా వాసు, ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ రామారావు, ఏడీఏ నరసింహారావు పాల్గొన్నారు.
తల్లాడ: అన్నారుగూడెంలో ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు
రైతు సంక్షేమానికి పెద్దపీట: కొండబాల: మధిర, మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రైతు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి భారీ నిధులు కేటాయించారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్ కమల్‌రాజు పేర్కొన్నారు. మధిర వ్యవసాయ మార్కెట్‌లోని రైతువేదికలో మాట్లాడారు. వారిద్దిరు ఎడ్లబండ్లపై వేదిక వద్దకు వచ్చారు. మాటూరులో కొండబాల స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. పుర ఛైర్‌పర్సన్ ఎం.లత, సొసైటీ ఛైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, ఏవో శ్రీనివాసరావు, కమిషనర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు: రైతు దుస్తులు ధరించి నాగలి భుజాన పెట్టుకుని ఎంపీపీ రఘు తదితరులు..
వైరా, కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, ఎర్రుపాలెం, ముదిగొండ, న్యూస్‌టుడే: సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరా మండలం ఖానాపురంలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మామిడితోటలో మేలు జాతి దూడల ప్రదర్శనను తిలకించారు. రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఏఎంసీ ఛైర్మన్ బీడీకే రత్నం, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
* కొణిజర్ల రైతువేదికలో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి పాల్గొని మాట్లాడారు. కొణిజర్ల, తనికెళ్లలో కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు. ఏర్పాట్లను పరిశీలించారు. కారేపల్లి మండలంలో అదనపు కలెక్టర్ స్నేహలత పరిశీలించారు.
మధిర: పట్టణంలో ఎడ్లబండ్ల భారీ ర్యాలీ
కొణిజర్ల: భోజన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్
అప్పాయిగూడెం రైతువేదికలో పనులు పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ స్నేహలత
ఏన్కూరు: జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్న సొసైటీ ఛైర్మన్ శెట్టిపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TREI - RB: ‘గురుకుల’ అభ్యర్థులకు నియామక బోర్డు కీలక సూచన
-
Rahul Dravid: వాళ్లెందుకు బౌలింగ్ చేయరంటే.. కారణం చెప్పిన ద్రవిడ్
-
Balakrishna: నా వైపు వేలు చూపుతూ.. రెచ్చగొట్టారు: తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ
-
Cricket World Cup: ముస్తాబవుతోన్న ఉప్పల్ స్టేడియం
-
తెదేపా దీక్షా శిబిరంపై వైకాపా రాళ్ల దాడి
-
TRT: టీఆర్టీ సిలబస్లో స్వల్ప మార్పు