వీరు ఏమయ్యారు?
కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో విజయవాడ వరకు రిజర్వేషన్ చేయించుకున్న వారిలో స్వల్ప గాయాలతో కొందరు, సురక్షితంగా ఎక్కువ మంది బయటపడ్డారు.
ఐదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్
ఎనిమిది మంది స్పందించలేదు
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ సిటీ: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో విజయవాడ వరకు రిజర్వేషన్ చేయించుకున్న వారిలో స్వల్ప గాయాలతో కొందరు, సురక్షితంగా ఎక్కువ మంది బయటపడ్డారు. ఇక్కడి వరకు మొదటి, ద్వితీయ, తృతీయ ఏసీ, స్లీపర్ కోచ్‌ల్లో మొత్తం 39 మంది ప్రయాణించారు. వీరిలో 13 మంది పరిస్థితి తెలియరాలేదు. ఐదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఎనిమిది మంది ప్రయాణికుల ఫోన్లు మోగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. వీరు మరణించారా? లేక ప్రాణాలతో ఉన్నారా? అన్నది ఇంకా ఇతిమిత్థంగా తెలియరాలేదు. ఇద్దరి ఫోన్ నెంబర్లు అందుబాటులో లేవు. మిగిలిన వారిలో పది మందే తెలుగు ప్రయాణికులు. ఇందులో విజయవాడ నగరానికి చెందిన వారు నలుగురు, గుంటూరు జిల్లా వారు ఇద్దరు, కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం.. ఒకరు కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. విజయవాడకు రిజర్వేషన్ చేయించుకున్న ఇతర రాష్ట్రాల వారిలో ఎక్కువ మంది ఇక్కడ దిగి వేరే రైలు అందుకోవాల్సిన వారే ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించారు. మరికొందరు తమ సొంత ఏర్పాట్లతో సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల వివరాలివీ..
మొత్తం రిజర్వేషన్ చేసుకున్న వారు: 39
స్విచ్ఛాఫ్ : 05
స్పందించని వారు : 08
ఫోన్ నెంబరు లేని వారు : 02
ఇతర రాష్ట్రాల వారు : 14
తెలుగు ప్రయాణికులు : 10
వీరిలో.. విజయవాడ నగరం: 4,
వీరంకి లాకులు (పమిడిముక్కల మండలం): 02,
గుంటూరు: 01, తెనాలి : 01
ఖమ్మం జిల్లా (తెలంగాణ) : 02
సురక్షితంగా బయటపడ్డా..
- రామారావు, బరంపురం, ఒడిశా
మాది ఒడిశాలో బరంపురం. తెలంగాణలోని భద్రాచలం సమీపంలోని చర్ల వద్ద ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నా ఎడమ చేతికి గాయాలయ్యాయి. స్థానికులు, ప్రయాణికుల సహకారంతో బయటపడ్డా. ప్రథమ చికిత్స చేయించుకున్నా. తరచూ ప్రయాణం చేస్తుంటా. ప్రమాదం జరగ్గానే కొద్ది సేపు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. కొంత మంది ప్రయాణికులు, స్థానికులు కూడా వారి వంతు సహకారాన్ని అందించంతో సురక్షితంగా బయటపడ్డా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు