logo

దయచేసి వినండి.. దొంగలతో జాగ్రత్త!

ప్రకాశం జిల్లాకు చెందిన నాగమణి మార్చి 20న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరారు. రైలులో నిద్రిస్తున్న ఆమె చరవాణిని ఎవరో దొంగిలించారు.

Updated : 09 Jun 2023 06:27 IST

రైళ్లలో పెరుగుతున్న చోరీలు

ప్రకాశం జిల్లాకు చెందిన నాగమణి మార్చి 20న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరారు. రైలులో నిద్రిస్తున్న ఆమె చరవాణిని ఎవరో దొంగిలించారు. ఖమ్మంలో చూసుకునేసరికి చరవాణి లేదు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో దిగి జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఆమె చరవాణి దొరకలేదు.

విజయవాడ మధురానగర్‌కు చెందిన నితిన్‌ రవితేజ ఫిబ్రవరి 29న మచిలీపట్నం ప్రత్యేక రైలులో సికింద్రాబాద్‌ వెళ్లారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు అతని రూ.70 వేల విలువ చేసే చరవాణిని దొంగిలించారు. ఖమ్మం వచ్చే సరికి చూసుకోగా చరవాణి కన్పించలేదు. ఖమ్మం జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పట¨కీ చరవాణీని కనిపెట్టలేకపోయారు.

ఇలాంటి సంఘటనలు రైళ్లలో నిత్యకృత్యంగా మారాయి. వేసవిలో రైళ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పిల్లలకు సెలవులు కావడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సుదూర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లే వారూ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారే లక్ష్యంగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏటా వీటి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జీఆర్పీ ఉన్నతాధికారులు దొంగతనాల నియంత్రణకు నడుం బిగించారు. ఏప్రిల్‌ మొదట వారం నుంచి జూన్‌ చివరి వారం వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రతిరోజూ రైళ్లలో ఎస్సై స్థాయి అధికారితో పాటు ప్రత్యేక సిబబందితో పెట్రºలింగ్‌ చేపడుతున్నారు.

మూడు జిల్లాల  ప్రత్యేక సిబబంది

రైళ్లలో చోరీల నియంత్రణకు ఖమ్మం జీఆర్పీతో పాటు కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన ప్రత్యేక సిబబందితో గస్తీ నిర్వహిస్తున్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌ పరిసరాలతో పాటు రైళ్లలో రాత్రి గసీˆ్త కాస్తున్నారు. మూడు జిల్లాల నుంచి 17 మంది కానిసేబల్స్‌తో పాటు మరో ఐదుగురు సిబబందిని కేటాయించగా.. రైళ్లలో ప్రతిరోజూ విధులు నిర్వర్తిస్తున్నారు. సింహపురి, చార్మినార్‌, బీదర్‌, మచిలీపట్నం రైళ్లలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నట్లు గుర్తించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైల్వేస్టేషన్‌లలో, రైళ్ల లోపల తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికులకు దొంగతనాలు/జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

చరవాణీలే  ఎక్కువ...

చోరీల్లో చరవాణీలే ఎక్కువ చోరీకి గురవుతున్నాయి. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో, ఛార్జింగ్‌ పెట¨్ట పక్కకు వెళ్లిన సమయంలో దొంగతనాలు చేస్తున్నారు. బగారు ఆభరణాలు, ఖరీదైన మొబైల్‌ ఫోన్లు కొట్టేస్తున్నారు. దొంగలు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉండటంతో రికవరీ సవాలుగా మారుతోంది.


ప్రత్యేక బృందాలతో గస్తీ...

అంతోటి వెంకటేశ్వరరావు, సీఐ, ఖమ్మం జీఆర్పీ

రైళ్లలో దొంగతనాల నియంత్రణకు ఖమ్మం-విజయవాడ మధ్యలో ప్రత్యేక బదాలతో గస్తీ చేపడుతున్నాం. ఖమ్మం-విజయవాడ నడుమ ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ స్టేషన్ల మధ్య ప్రత్యేక బదాలతో పర్యవేక్షణ పెంచాం. ప్రయాణికుల భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు