logo

యువత చేతిలోనే దేశ భవిత

దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, రానున్న రోజుల్లో భారత్‌ను ముందుకు నడిపించేది యువతేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

Published : 09 Jun 2023 02:59 IST

ఎంపీ నామా నాగేశ్వరరావు
ఘనంగా యువజనోత్సవాలు

యువకుల నృత్యాలు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, రానున్న రోజుల్లో భారత్‌ను ముందుకు నడిపించేది యువతేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా నెహ్రూ యువ కేంద్రం, ఖమ్మం ఎస్‌బీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో యువ-2023 ఉత్సవాలను గురువారం నిర్వహించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... యువత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టటంతో పాటు విద్య, క్రీడల వంటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. గతం కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే చదువుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమని చెప్పారు. యువతీ యువకులు దేశ అభివృద్ధి కోసం నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఐటీ రంగంలో అమెరికా స్థాయిలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోందన్నారు. యువత అభ్యున్నతికి ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ఐటీ ఎగుమతులు 240 శాతానికి పెరిగాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐటీ కళాశాల ఛైర్మన్‌ గుండాల కృష్ణ, ఎన్‌వైకే జిల్లా యువజన అధికారి సి.అన్వేష్‌, ఎన్‌వైకే భానుప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ జి.రాజ్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధికారి శ్రీనివాసరావు, రైతుబంధు సమితి జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వర్లు, కళాశాల డైరెక్టర్లు పాల్గొన్నారు. యువతీ యువకుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని