logo

మహిళా హక్కుల రక్షణకు ఉద్యమించాలి

మహిళా హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు.

Published : 09 Jun 2023 02:59 IST

శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: మహిళా హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో జోనల్‌ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా మల్లు లక్ష్మి హాజరై మాట్లాడారు. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో మహిళలపై లైంగిక దాడులు పెరిగాయని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. 2014 నుంచి భాజపా నిత్యావసర సరకుల ధరలను పెంచి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, అనేక మంది మహిళలు పోషక పదార్థాలు తీసుకోవడం కష్టంగా మారడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుగ్గవీటి సరళ ప్రిన్సిపల్‌గా వ్యవహరించగా.. ‘తెలంగాణ ప్రజా పోరాటం, మహిళల పాత్ర’ అనే అంశాన్ని బత్తుల హైమావతి బోధించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, రాష్ట్ర నాయకులు పాలడుగు ప్రభావతి, రత్నమాల, ప్రమీల, శ్రీలక్ష్మీ, అఫ్రోజ్‌ సమీనా, రమణ, నాగసులోచన, మెహరున్నీసాబేగం, కృష్ణవేణి, బాగం అజిత,  సీతాలక్ష్మీ, కవిత పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని