logo

11న లక్ష గొంతుకలతో ‘ప్రజాగర్జన’: కూనంనేని

గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ నిర్వహించని రీతిలో లక్ష గొంతుకలతో ‘ప్రజాగర్జన బహిరంగ సభ’ను కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ఈ నెల 11న నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Published : 09 Jun 2023 02:59 IST

విలేకరులతో మాట్లాడుతున్న కూనంనేని, చిత్రంలో సాబీర్‌పాషా, బందెల నర్సయ్య

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ నిర్వహించని రీతిలో లక్ష గొంతుకలతో ‘ప్రజాగర్జన బహిరంగ సభ’ను కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ఈ నెల 11న నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. 1990కి పూర్వం మాదిరిగా పెద్ద సభను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్‌ 14 నుంచి మే 14 వరకు అన్ని నియోజవర్గాల్లో ‘బీజేపీకీ హఠావో.. దేశ్‌కి బచావో’ ఆందోళన నిర్వహించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎన్నికల వాగ్దానాల అమలులో విఫలమయ్యాయన్నారు. హామీలను నెరవేర్చడంతో పాటు పేదల సొంతింటి కల నెరవేర్చాలని, విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలని, 58 ఏళ్లు నిండిన వారందరికీ పింఛను, గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని మహాసభ ద్వారా నిలదీస్తామన్నారు. జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా మాట్లాడుతూ ప్రజాగర్జనకు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, నాయకులు కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్‌, కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాస్‌, మురళి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని