logo

మేమంతా.. చంద్రబాబుకు అండగా..

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మద్దతుగా ఖమ్మంలో అభిమానులు కదంతొక్కారు.

Updated : 18 Sep 2023 06:25 IST

ఖమ్మంలో కదం తొక్కిన అభిమాన సంద్రం

పెవిలియన్‌ మైదానంలో కొవ్వొత్తుల ప్రదర్శన

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మద్దతుగా ఖమ్మంలో అభిమానులు కదంతొక్కారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై భగ్గుమన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ రూపకర్త.. సైబరాబాద్‌ సృష్టికర్త చంద్రబాబునాయుడిని రిమాండ్‌కు పంపిన తీరుపై నిరసన తెలిపారు. చంద్రబాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంఘీభావ ర్యాలీకి భారీగా తరలివచ్చారు. తెదేపా, భారాస, కాంగ్రెస్‌ పార్టీల్లోని అభిమానులు, సామాన్యులు, ఉద్యోగులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో కదం తొక్కారు. సాయంత్రం 4 గంటల నుంచే ఎన్టీఆర్‌ కూడలి వద్దకు చంద్రబాబు అభిమానులు భారీగా వచ్చారు. 4:30గంటలకు అభిమానులను అదుపు చేయటం నిర్వాహకులకు సాధ్యం కాలేదు. 5 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినదించారు.   పెవిలియన్‌ మైదానం వరకు సుమారు గంట పాటు     పాదయాత్ర సాగింది. తెదేపా పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరీశ్‌, ఖమ్మం శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూరపాటి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు ప్రశాంత లక్ష్మి, కొత్తపల్లి నీరజ, సరిపూడి రమాదేవి, చిరుమామిళ్ల లక్ష్మి,  మిక్కిలినేని మంజుల, మోతారపు శ్రావణి, నాయకులు   చింతనిప్పు కృష్ణచైతన్య, మందడపు రామకృష్ణ, మందనపు సుధాకర్‌, వల్లభనేని రామారావు, నల్లమల రంజిత్‌, వైద్యులు డా.ప్రదీప్‌, డా.అసాధారణ్‌, డా.యుగేందర్‌, కంభంపాటి  నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా నందమూరి చైతన్యకృష్ణ: చంద్రబాబు అభిమానులు చేపట్టిన సంఘీభావ ర్యాలీలో ఎన్టీఆర్‌     మనువడు నందమూరి చైతన్యకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అభిమానులతో కలిసి పెవిలియన్‌ మైదానం వరకు నడిచారు.ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఉన్నారు.

బాబుతో నేను’ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నందమూరి చైతన్యకృష్ణ, చంద్రబాబు అభిమానులు

ప్లకార్డు ప్రదర్శిస్తున్న చిన్నారి

ఖమ్మం: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్న ఆయన అభిమానులు

ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైబస జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు