logo

ఉనికి చాటాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉనికి చాటాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. తాజాగా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జిలను ప్రకటించింది.

Updated : 27 Sep 2023 05:39 IST

ఈటీవీ- ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉనికి చాటాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. తాజాగా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జిలను ప్రకటించింది. ఖమ్మం జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జితోపాటు పది శాసనసభ స్థానాలకు సమన్వయ బాధ్యులను నియమించింది.

ఏజెన్సీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

వరంగల్‌కు చెందిన కలవాల త్రిలోకేశ్వర్‌ను ఖమ్మం జిల్లా భాజపా ఇన్‌ఛార్జిగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నియమించారు. పినపాక నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా అజ్మీరా కృష్ణవేణినాయక్‌, ఇల్లెందు- కటకం నర్సింగ్‌రావు, ఖమ్మం- మారేపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, పాలేరు- పెదగాని సోమయ్యగౌడ్‌, మధిర- జలగం రంజిత్‌, వైరా- కూసంపూడి రవీంద్ర, సత్తుపల్లి- కనగాల వెంకట్రామయ్య, కొత్తగూడెం- మేఘనాథ్‌, అశ్వారావుపేట- గాదె రాంబాబు, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా తాటి కృష్ణ నియమితులయ్యారు. పార్టీ శ్రేణులను శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించేందుకు ఇన్‌ఛార్జిలకు సమన్వయ బాధ్యతలను రాష్ట్ర నాయకత్వం అప్పగించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన భాజపా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు ఉభయ జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో ఇటీవల పర్యటించారు. కార్యకర్తలను కలిసి ఆశావహుల బలాబలాలపై ఆరా తీశారు. ఈసారి ప్రత్యేకంగా ఏజెన్సీ నియోజకవర్గాలపై భాజపా దృష్టి సారించింది. ఎస్టీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ముఖ్యనేతల పర్యటనలతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీకి ఆశించిన బలం లేకపోవడం కమలదళాన్ని కలవరపెడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని