logo
Published : 29/11/2021 04:03 IST

బకాయిలు విడుదల చేయరూ..

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక అవసరాల కోసం పెట్టుకున్న పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ఆడిటర్‌ కమిటీ కన్వీనర్‌ బి.జాన్సన్‌బాబు కోరారు. ఆదివారం ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్నెళ్ల క్రితం దరఖాస్తులు చేసుకున్న పీఎఫ్‌ లోన్లు, పార్ట్‌ఫైనల్‌, ఏపీజీఎల్‌ఐ గడువు తీరిపోయిన బాండ్లకు సంబంధించిన మొత్తాలను ప్రభుత్వం విడుదల చేయటం లేదన్నారు. ప్రభుత్వం త్వరితగతిన బకాయిల మొత్తాలను విడుదల చేయాలని కోరారు. సభ్యులు డి.వెంకటరత్నం, ఆర్‌.శ్రీహరి, పి.శ్రీనివాస్‌, సీవీఎల్‌ నరసింహారావు, సీహెచ్‌.నాగమల్లేశ్వరరావు, ఆర్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని