logo
Published : 01/12/2021 03:03 IST

సమస్యలు చర్చించకుండానే ముగిసిన సమావేశం


సమావేశంలో ప్రశ్నిస్తున్న తెదేపా సభ్యులు అబ్దుల్‌హుస్సేన్‌, సురేంద్ర, సత్యవతి

తిరువూరు, న్యూస్‌టుడే: స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన పాలకవర్గం సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. అజెండాలో చేర్చిన అంశాలపై చర్చించే నిమిత్తం ఛైర్‌పర్సన్‌ జి.కస్తూరిబాయి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే తెదేపా సభ్యులు షేక్‌ అబ్దుల్‌హుస్సేన్‌, నాళ్లా సురేంద్ర, జీడిమళ్ల సత్యవతి పట్టణంలో నెలకున్న సమస్యలను ప్రస్తావించారు. తాము పలుమార్లు సమావేశంలో ప్రస్తావించిన కోతులు, కుక్కల బెడద సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునే విషయమై చర్చించే నిమిత్తం అజెండాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అజెండాను సమావేశానికి ఒక రోజు ముందు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల సరఫరా చేసే పైలెట్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మూడు రక్షితనీటి పథకాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ సమావేశంలో తీర్మానించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించిన సమస్యలను సమావేశంలో చర్చించకుండానే ముగించారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని