logo
Published : 01/12/2021 03:03 IST

ఘరానా దొంగ అరెస్టు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పలు ద్విచక్ర వాహనాలు, వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తిని హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు కథనం ప్రకారం.. విజయవాడ వైఎస్సార్‌ కాలనీకు చెందిన షేక్‌ గౌస్‌ బాషా.. మంగళవారం తెల్లవారుజామున వేలేరు అడ్డరోడ్డు వద్ద రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ వాహనంతో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సీఐ సతీష్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు గౌతమ్‌కుమార్‌, ఉషారాణి, దుర్గాప్రసాద్‌ల బృందం అదుపులోకి తీసుకుంది. అతడ్ని విచారించగా, హనుమాన్‌జంక్షన్‌ పరిధిలో అయిదు, వీరవల్లిలో ఒకటి, గుంటూరు జిల్లా లాలాగూడ పరిధిలో మరొక ద్విచక్ర వాహనం అపహరించినట్లు తేలింది. వీటితో పాటు బాపులపాడు మండలం అంపాపురం, మల్లవల్లి, ఎ.కొండూరు సమీపంలోని చైతన్యనగర్‌, రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చరవాణులు, బంగారం, నగదు చోరీ చేసినట్లు నిర్ధ.రణ అయ్యింది. మొత్తంగా రూ.9,31,000 విలువ చేసే ఏడు ద్విచక్ర వాహనాలు, రూ.4,29,400 నగలు, నగదు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సాయినగర్‌లో ఉంటున్న గౌస్‌పై విజయవాడ వన్‌టౌన్‌, టూటౌన్‌, సత్యనారాయణపురం, అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసు స్టేషన్లలో పలు దొంగతనాల కేసులు నమోదయ్యాయని, టూటౌన్‌లో ఫోక్సో కేసు కూడా ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని