logo
Published : 01/12/2021 03:03 IST

సమాజాభివృద్ధికి యువత కృషి చేయాలి


కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న సూర్యనారాయణ, మీనాక్షి దంపతులు, పక్కన కృష్ణా వర్సిటీ వీసీ చంద్రశేఖర్‌, కొనకళ్ల తదితరులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: యువత సమాజాభివృద్ధికి తమవంతు కృషి చేయాలని యూనివర్శిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడా ఆచార్యులు, హిందూ కళాశాల పూర్వ విద్యార్థి చల్లపల్లి సూర్యనారాయణ అన్నారు. ఎస్వీహెచ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో తన తల్లిదండ్రులు రామబ్రహ్మం, కామేశ్వరిల జ్ఞాపకార్థం రూ.కోటితో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ను మంగళవారం ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదువుకున్న కళాశాలకు సాయం అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాదు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ అమెరికాలో సూర్యనారాయణ చేసిన పరిశోధనలు, అందుకున్న పురస్కారాల గురించి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వందమంది శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరని చెప్పారు. సూర్యనారాయణని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.బి చంద్రశేఖర, హిందూ అనుబంధ కళాశాలల పాలకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, కళాశాల ఛైర్మన్‌ దైతా గోపాలకృష్ణశాస్త్రి, పాలకవర్గ కమిటీ సభ్యులు దింటకుర్తి ప్రసాదు తదితరులు అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డా.డి శ్రీనివాసరావు, డీన్‌ సూర్యప్రకాశరావు, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్‌ భారతి తదితరులు పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని