logo
Published : 01/12/2021 03:03 IST

నిధుల మళ్లింపుపై ఎన్టీఆర్‌ వర్సిటీ ఉద్యోగుల ఆందోళన


విశ్వవిద్యాలయం ఆవరణలో ఉద్యోగుల ప్రదర్శన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్ల నిధులను ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు మళ్లించిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టాయి. వర్సిటీలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా మంగళవారం సమావేశమై సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విశ్వవిద్యాలయం ప్రధానద్వారం ఎదుట బైౖఠాయించి నిరసన తెలిపారు. నిధులు వెనక్కి రాబట్టేందుకు పోరాటం చేస్తామని ప్రకటించారు. వర్సిటీ అభివృద్ధిని, ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాలని రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. భవిష్యత్తులో విశ్వవిద్యాలయం పరీక్షలు, కౌన్సెలింగు నిర్వహించాలన్నా నిధులు కొరత ఉంటుందని ఉద్యోగ సంఘం ప్రతినిధులు అక్కిరాజు, నరసింహారావు పేర్కొన్నారు.

ఐకాస ఏర్పాటు : ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న విశ్వవిద్యాలయం ఉద్యోగ సంఘాలు మంగళవారం ఐకాసగా ఏర్పడ్డాయి. ఛైర్మన్‌గా వి.వి.నారాయణ, కో-ఛైర్మన్లుగా జె.సుసన్న, కె.నరసింహారావు, కన్వీనరుగా జి.వాసు, కో-కన్వీనర్లుగా టి.పోతురాజు, ఎం.వి.అక్కిరాజు, సభ్యులుగా అంబేడ్కర్‌, బి.శివరామకృష్ణ, పి.రవి ప్రసాద్‌,ఎం.శ్రీనివాసరెడ్డి, జి.స్వరూపరాణి, డి.వి.రమణమూర్తి, డి.రామకృష్ణ, కె.రాజేంద్రబాబు,టి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, ఆర్‌.వి.ఎన్‌.ప్రసాద్‌ నియమితులయ్యారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని