logo
Published : 01/12/2021 03:03 IST

ఆక్వా.. కొత్తగా

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే గతంతో పోల్చుకుంటే ఆక్వాసాగులో అనేక మార్పులు సంతరించుకున్నాయి. వీటితో పాటు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ తదితరాలను పరిగణనలోకి తీసుకుని రైతులు  కొత్త బాటను అనుసరిస్తున్నారు.  
జిల్లాలో 60వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తుండగా వాటిలో 50వేల ఎకరాల వరకు ఉప్పునీటి రొయ్యలు ఉంటుంది. 2010 వరకు రైతులు అందరూ టైగర్‌ రొయ్యల సాగు చేస్తుండే వారు.  కొన్నేళ్ల పాటు లాభాలు కురిపించిన ఈ పంట వివిధ రకాల వ్యాధులు సోకి దెబ్బతినడంతో చాలామంది దీనికి దూరమయ్యారు. ఆ తరువాత ఆ స్థానంలో వనామీ రకం మళ్లీ ఆశలు రేకెత్తించింది. ఎక్కువ లాభాలు కురిపించడంతో చాలామంది దీనిపై దృష్టి సారించారు. క్రమేపీ.  రొయ్యపిల్లల నాణ్యత తగ్గడం, వైట్‌స్పాట్‌తోపాటు పలు ఫంగస్‌ వ్యాధులు సోకడంతో మార్కెట్‌లో ధరలు పడిపోయి విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు కొత్తగా వచ్చిన మోనోటైగర్‌ రొయ్యల సాగు చేపట్టారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాలతో కలిపి 5వేల ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువశాతం అవనిగడ్డ డివిజన్‌లోనే ఉంది. ఎకరాకు 35 నుంచి 40వేల పిల్ల వేస్తే రూ.రెండున్నర లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎనిమిది నుంచి పది క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని అంటున్నారు. 

పండుగప్పవైపు రైతుల చూపు
జిల్లాలో 1,25,000 ఎకరాల్లో చేపలసాగు జరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ బొచ్చెలు, రేగండి తదితర రకాల చేపలు సాగవుతున్నాయి. ఇటీవల కాలంలో మేత, మందుల వ్యయం పెరగడంతోపాటు ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. దీంతో తిలాపియా, ఫంగస్, రూప్‌చంద్‌ లాంటి చేపల రకాలు సాగు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్‌లో పండుగప్ప చేపలకు గిరాకీ ఉండటంతోపాటు పిల్ల కూడా అందుబాటులో ఉండటంతో రైతులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. బందరు మండలంలోని గరాలదిబ్బ, పోలాటితిప్పతోపాటు అవనిగడ్డలోని పలు గ్రామాల రైతులు రాష్ట్రంలోని కాకినాడ, పాండిచ్ఛేరి, యానాం ప్రాంతాల్లోని హేచరీలనుంచి పిల్లలుతెచ్చి, చెరువుల్లో కొంతకాలం పెంచి రైతులకు విక్రయిస్తున్నారు. ఎకరాకు 2వేల నుంచి 3వేల పిల్లవేస్తే 85శాతం వరకు బతుకుతున్నాయి. ఏడాదికాలం  ఉంచితే  ఒక్కోచేప కేజీన్నర నుంచి రెండు కేజీల వరకు పెరుగుతుందని,    ఎకరాకు ఐదుటన్నులకుపైగా దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గతంలో అక్కడక్కడ ఓ వంద ఎకరాల్లో ఉండే ఈసాగు ప్రస్తుతం 600 ఎకరాలకు పెరిగిందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

పెరుగుతున్న కొరమీను సాగు
 మంచిధర పలికే నల్లజాతి రకం చేపల్లో కొరమీను ప్రత్యేకమైనది. దీనికి మంచి డిమాండ్‌ ఉంది. ఈసాగును ప్రోత్సహించేందుకు మత్స్యశాఖ కూడా తగు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే జిల్లాలో మండవల్లి, హనుమాన్‌ జంక్షన్లలో హేచరీలు కూడా ఏర్పాటు చేశారు. పెద్దసైజు పిల్ల  ఒక్కొక్కటి రూ.3ల నుంచి రూ.5లకు దొరుకుతుండటంతో రైతులు ఆసక్తి    చూపుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో ప్రస్తుతం కొరమీను సాగవుతోంది. నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బందరు మండలాల్లో ఎక్కువమంది రైతులు పీతల సాగు కూడా చేస్తున్నారు. 
ప్రత్యామ్నాయంవైపు 
 పెట్టుబడి పెరగడంతోపాటు దిగుబడులు తగ్గుతున్న కారణంగా రైతులు ప్రత్యామ్నాయంవైపు చూస్తున్నారు. దీనిలో భాగంగా మోనోటైగర్‌రొయ్యసాగు విస్తీర్ణం పెరుగుతోంది. గుర్తింపు పొందిన హెచరీల్లో మాత్రమే పిల్ల కొనుగోలు చేయాలని కోరుతున్నాం. పండుగప్ప, కొరమీను తదితర రకాల సాగుకూడా పెరుగుతోంది. సలహాలు, సూచనల కోసం మత్స్యశాఖ అధికారులను సంప్రదించాలని కోరుతున్నాం. 
- షేక్‌లాల్‌మహ్మద్, మత్స్యశాఖ జేడీ

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని