logo
Published : 01/12/2021 03:03 IST

బియ్యం కుంభకోణంపై విచారణ

 కైకలూరులో ఎంఎల్‌ఎస్‌ కేంద్రం, గోదాముల పరిశీలన 


సరకులను పరిశీలిస్తున్న ఆర్డీవో ఖాజావలి

కైకలూరు, న్యూస్‌టుడే రాష్ట్రంలో సంచలనమైన కైకలూరు ఎంఎల్‌ఎస్‌ కేంద్రంలో బియ్యం కుంభకోణంపై ఎట్టకేలకు జిల్లా అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. జేసీ సూచనల మేరకు మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి ప్రత్యేక అధికారిగా మంగళవారం కైకలూరు విచ్చేసి స్థానిక గోదాముల్లో అక్రమాలపై విచారణ చేశారు. తొలుత ఎంఎల్‌ఎస్‌ కేంద్రంలో కంప్యూటర్‌ గదిని పరిశీలించారు. కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు గోదాముల ఇన్‌ఛార్జి హుళకేశ్వరరావు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్యాంకిషోర్‌ను సుమారు గంటపాటు విచారించి వివరాలు నమోదు చేశారు. ఇద్దరూ పొంతలేని సమాధానాలు చెప్పడంతో ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా సరకులను ఎలా మాయం చేశారనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అవకతవకలు జరిగిన గోదాములను అధికారులతో కలసి ఆర్డీవో పరిశీలించారు. హమాలీల నుంచి పలు వివరాలు సేకరించారు.

డీలర్ల ఫిర్యాదు 
కైకలూరు, కలిదిండి, మండవల్లి మండలాల డీలర్లు తమ సమస్యలను ఆర్డీవోకు నివేదించారు. గోదాముల పరిధిలోని ఈ మండలాల్లో బియ్యం, పంచదార, కందిపప్పు అధిక మొత్తంలో రావాల్సి ఉందని, అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోయారు. కొల్లేరులంక గ్రామాలైన పందిరిపల్లెగూడెం, పెంచికలమర్రు, కొల్లేటికోటకు అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం  సరఫరా చేసిన ఉచిత బియ్యం ఇవ్వలేదని, 30 టన్నుల వరకు రావాల్సి ఉందని డీలరు జల్లూరి వెంకన్న తెలిపారు. సరకు అందిస్తామన్న అధికారుల అనుమతులతో లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించామని, ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. దీనిపై అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆర్డీవో ప్రశ్నించగా, గుడివాడ ఏఎస్‌వో, స్థానిక తహసీల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లామని ఆయన తెలిపారు. డీలర్లు వినతిపత్రం అందజేసి తమకు ఇవ్వాల్సిన 11,000 బస్తాల బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు  తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేశారు.  

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని