logo
Published : 01/12/2021 03:03 IST

ఆ పాఠశాలలు మూసివేతే..!

జిల్లాలో 237 గుర్తింపు


గూడూరులో విద్యార్థులు లేక మూతపడిన ప్రయివేటు పాఠశాల

మచిలీపట్నం కార్పొరేషన్‌., న్యూస్‌టుడే తక్కువ మంది విద్యార్థులతో నడుస్తోన్న ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలను గుర్తించి మూసివేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా విద్యాశాఖ ఆమేరకు కార్యాచరణ చేపట్టింది. అలాంటి పాఠశాలలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో గుర్తించి, యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడానికి  రంగం సిద్ధం చేస్తున్నారు.
కొన్నింటిలో ఒకరిద్దరే జిల్లాలో 20లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 237 ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఆగిరిపల్లి, అవనిగడ్డ, బంటుమిల్లి, బాపులపాడు, చల్లపల్లి, చందర్లపాడు, చాట్రాయి, జి.కొండూరు, గంపలగూడెం, గన్నవరం, గుడివాడ, ఘంటసాల, గుడ్లవల్లేరు, గూడూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కలిదిండి, కంచికచర్ల, కంకిపాడు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మండవల్లి, మోపిదేవి, ముదినేపల్లి, నాగాయలంక, నందిగామ, నూజివీడు, పామర్రు, పమిడిముక్కల, పెడన, పెదపారుపూడి, పెనమలూరు, రెడ్డిగూడెం, తోట్లవల్లూరు, పెనమలూరు, పెనుగంచిప్రోలు, ఉంగుటూరు, వత్సవాయి, వీరులపాడు, ఉయ్యూరు ప్రాంతాల్లో అలాంటి పాఠశాలలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఒకటి నుంచి ఐదులోపు పాఠశాలలు ఉంటే విజయవాడ రూరల్, అర్బన్‌ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. కొన్నింటిలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అవనిగడ్డ ఎస్‌జీవీఎస్‌ఎస్‌వీఎం ప్రాథమికోన్నత పాఠశాల, ముదినేపల్లి మండలంలోని నరసన్నపాలెంలో సాల్వేషనార్మి , కలిదిండిలోని వీవీఎన్‌ ఇలా అనేక పాఠశాలల్లో కేవలం ఒక విద్యార్థి చొప్పున ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. పదిమందికి పైబడి విద్యార్థులున్నవి వందలోపే ఉన్నాయి. ఇలాంటి వాటిని మూసివేయించేందుకు కసరత్తు  ప్రారంభించారు.

అందరికీ నోటీసులు
విద్యాశాఖ గుర్తించిన వాటిలో చాలా వరకు ఇప్పటికే పిల్లలు లేక మూతపడ్డాయి. బందరు నియోజకవర్గంలో 18 ఉంటే పదికిపైగా ఇప్పటికే మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాటి గుర్తింపు ఇంకా కొనసాగుతుండటంతో యాజమాన్యాలు అందరికీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎప్పటి నుంచి తగ్గింది...ప్రస్తుతం ఉన్నారా..లేరా తదితర అంశాలపై యాజమన్యాల నుంచి సమాధానం కోరుతున్నారు.  ఆయా పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలని ఎమ్యీవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. 20మందిలోపు విద్యార్థులు ఉన్న వాటన్నింటినీ మూసివేయించి అక్కడ ఉన్న విద్యార్థులను సమీపంలోని బడికి పంపించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మార్గదర్శకాలకు  అనుగుణంగా
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుణంగా 20మంది లోపు విద్యార్థులున్న పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నాం. పరిశీలన నిమిత్తం అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారంతో సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తాం. తరువాత వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి. - తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి 

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని