logo
Published : 01/12/2021 03:03 IST

సాహితీ రుషి.. సిరివెన్నెల..

జిల్లాతో ఆత్మీయానుబంధం


శ్రీకాకుళంలో సిరివెన్నెలను సత్కరించి  శ్రీకృష్ణ దేవరాయల ప్రతిమను అందజేస్తున్న
సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌  (దాచిన చిత్రం)


విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే తెలుగు సాహిత్యంలో, తెలుగు ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి జిల్లాతో అనుబంధం ఉంది. జిల్లాలోని నిర్వహించిన పలు సాహిత్య కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సాహిత్యం విలువ తెలిసిన చోట సీతారామశాస్త్రి వాలిపోతారనే నానుడి ఉంది. సిరివెన్నెల హఠాన్మరణం తీరని లోటని పలువురు సాహితీ ప్రముఖులు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి పూర్ణచంద్‌ సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెలతో కలిసి హంస(కళారత్న)పురస్కారం అందుకోవడం గౌరంగా భావిస్తున్నానని చెప్పారు.  సాహితీ లోకానికి, సినీ గేయాభిమానులకు అశనిపాతం లాంటిదని సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి అన్నారు. ఆయన కలంతో కాలాన్ని చదివిన రుషి అని ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ నారాయణ పేర్కొన్నారు. సిరివెన్నెల సాహిత్యం అన్ని వయసుల వారికి సులువుగా అర్థమవుతుందని అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు చీదెళ్ళ నాగేశ్వరరావు అన్నారు.
 అమ్మ భాష అందరికీ అవసరం : సిరివెన్నెలకు కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఎనలేని అనుబంధం ఉంది. 2018, ఫిబ్రవరిలో తెలుగు భాష బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాల్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. 2019 డిసెంబరులో విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల 4వ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మనలో మౌలికత భారతీయత, దాన్ని ప్రదర్శించే వాహికగా అమ్మభాష అవసరమని, తెలుగు భాష గొప్పదనాన్ని సిరివెన్నెల కొనియాడారు. సీతారామశాస్త్రి తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించింది. 2018లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయనకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో కళారత్న(హంస) పురస్కారం అందించి గౌరవించింది 

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని