logo
Published : 01/12/2021 03:03 IST

ధ్యానం సిద్ధం.. కొనుగోళ్లే ఆలస్యం..


పెడన మండలం కొంగంచర్ల ప్రాంతంలో రహదారిపై ధాన్యంరాశులు


గొడుగుపేట (మచిలీపట్నం)  న్యూస్‌టుడే ఖరీఫ్‌ వరి పంట చేతికొచ్చేసింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పండే ప్రతి గింజ కొంటేనే అన్నదాతకు ఆనందం.
కేంద్రాల అనుసంధానం ఏదీ?
* జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 2.55 లక్షల హెక్టార్లలో వరి సాగయ్యింది. 11 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని వ్యవసాయఅధికారులు అంచనావేశారు. వీటిలో 8 లక్షల టన్నులకుపైగా  కొనాలని నిర్ణయించారు.*జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.  వీటిని మిల్లులకు అనుసంధానించాల్సి  ఉంది.   జిల్లావ్యాప్తంగా 189 మిల్లుల ద్వారా ధాన్యం కొనేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా మిల్లుల సామర్థ్యాన్ని బట్టి కేంద్రాలను అనుసంధానం చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదు. ఒక్కో  మిల్లుకు 10 కేంద్రాలు కేటాయించాల్సి ఉంటే  ఇప్పటికి ఒకటి రెండు మాత్రమే అనుసంధానం చేసినట్లు మిల్లర్లు చెబుతున్నారు. 

పూర్తిస్థాయిలో పూచీకత్తు ఇవ్వని మిల్లర్లు
మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొని మరపట్టించి గోదాములకు తరలిస్తారు. ఇలా ధాన్యం ఆడించినందుకు మిల్లుల యజమానులు  ముందుగానే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉంటుంది. మిల్లుల సామర్థ్యాన్నిబట్టి పూచీకత్తు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు కేవలం 20శాతం మిల్లులు మాత్రమే చెల్లించాయి. మిగిలిన మిల్లులు ఇంకా చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చినవి మాత్రమే ఆన్‌లైన్‌ అయ్యాయి. అవి మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. 

ఆరబెట్టలేక  అవస్థలు
బయట వ్యాపారుల ప్రమేయం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకే విక్రయించేలా చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో రైతులు విక్రయించలేక పోతున్నారు. కేంద్రాలకు విక్రయించాలంటే  తేమ 17 శాతం ఉండాలి. గత నెలరోజులుగా వాతావరణం మేఘావృతం అయి ఉండటంతోపాటు తరచుగా వర్షాలు పడటంతో  పంటలో తేమశాతం 25శాతానికిపైగా ఉంటున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు. బందరు, పెడన, గూడూరు ఇలా అనేక మండలాల్లో కొందరు  రహదారుల పక్కన, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆర పెడుతున్నారు. ధాన్యం ఆరబెట్టలేక చాలామంది  యంత్రాలతో కోయించి అప్పటికప్పుడే వ్యాపారులకు విక్రయించేస్తున్నారు. బస్తా రూ.1150 నుంచి  రూ.1200కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. పంటపై చేసిన పెట్టుబడి అప్పులు, కూలీల ఖర్చులు తదితరాలకు డబ్బులు లేక చాలామంది కుప్పలు వేయకుండానే అమ్మేస్తున్నారు. 

అన్ని ఏర్పాట్లు చేశాం: కె.మాధవీలత, జేసీ
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పుడిప్పుడే  పంట నూర్పిళ్ల ప్రక్రియ సాగుతోంది. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సమర్పిస్తున్నారు. వచ్చినవి వచ్చినట్లు ఆన్‌లైన్‌ చేస్తున్నాం. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలను మ్యాపింగ్‌ చేస్తున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశించిన మద్ధతు ధరతో ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉన్నాం. క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా పర్యవేక్షించడంతోపాటు అవసరమైన సిబ్బందిని  నియమిస్తున్నాం. అన్నదాతలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. 

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని