logo
Updated : 01/12/2021 16:25 IST

అక్రమంగా తరలిస్తు్న్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత

మోపిదేవి: అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు బుధవారం పట్టుకున్నారు. తహసీల్దారు మస్తాన్‌ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు ఎగుమతి అవుతున్న 50కేజీల బరువుగల 650 బస్తాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రికార్డులను పరిశీలించగా లారీ డ్రైవర్‌ ముస్తాఫా ఖాన్‌, లారీ యజమాని సునీల్‌ సరైన ఆధారాలు చూపలేదు. దీంతో లారీని సీజ్‌ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తహసీల్దారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు ప్రభు కుమార్‌, ఆర్‌ఐ సునీత, వీఆర్‌వోలు మూర్తి, శ్రీనివాసరావులు పాల్గొన్నారు. 

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని