రూ.400 కోట్లు ఎలా మళ్లిస్తారు?
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: నిబంధనలు తుంగలో తొక్కి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లు ఎలా మళ్లిస్తారని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రశ్నించారు. గత వారం రోజులుగా యూనివర్సిటీ నిధులపై ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సోమవారం ఆయన మద్దతు ప్రకటించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరామని, నిధుల విషయమై మాట్లాడతానన్నారు. తొలుత వీసీ శ్యాంప్రసాద్‌తో ఉద్యోగ ఐకాస నాయకులు, ఎమ్మెల్సీ చర్చించారు. ఉద్యోగుల భద్రత, విశ్వవిద్యాలయ నిర్వహణపై దృష్టి సారించి నిధులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల, కార్మికుల సంఘ నాయకులు కోటేశ్వరరావు, భానుప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, ఐకాస నాయకులు అక్కిరాజు, నరసింహారావు, నారాయణ, వాసు, పోతురాజు పాల్గొన్నారు.
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.