logo
Published : 07/12/2021 02:25 IST

అంబేడ్కర్‌ స్ఫూర్తితో ప్రగతి సాధిద్దాం

పెడన: రాజ్యాంగ ప్రతులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రమేష్‌

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. అధికార వైకాపాతో పాటు, తెదేపా, భాజపా, జనసేన తదితర పార్టీల నేతలు ఆయా ప్రాంతాల్లో ప్రముఖ కూడళ్లలో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆయా మండలాల్లో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. కొన్నిచోట్ల పార్టీ కార్యాలయాలు, కూడళ్లలో ఆ మహనీయుని చిత్రపటాలను ఏర్పాటు చేసి గౌరవాన్ని చాటుకున్నారు. పలు ఎస్సీ కాలనీల్లో దళిత సంఘాల నాయకులు రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్‌ కల్పించిన హక్కులు తమకు వరమయ్యాయని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు అంబేడ్కర్‌ ఆశయ సాధనకు శ్రమిస్తామని ప్రతినబూనారు. జిల్లావిద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో తాహెరాసుల్తానా, కృష్ణావిశ్వవిద్యాలయంలో ఉపకులపతి కె.బి చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ రామిరెడ్డి అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి, దేశానికి అందించిన సేవలను వివరించారు. గూడూరు మండలం ఐదుగుళ్లపల్లి గ్రామంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాదు తదితరులు అంబేడ్కర్‌ సేవలను కొనియాడారు. పెడన మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా అంబేడ్కర్‌ పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగి రమేష్‌ రాజ్యాంగ ప్రతులను అంబేడ్కర్‌ యువజన సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. కృత్తివెన్ను తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్‌ పాత్రను ప్రజలకు వివరించారు. బంటుమిల్లి మండలంలోనూ అంబేడ్కర్‌ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కైకలూరు తాలూకా కూడలిలో, ముదినేపల్లి బస్‌స్టేషన్‌ వద్ద, కలిదిండి. మండవల్లిలో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. తిరువూరు బోసుబొమ్మకూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి శావల దేవదత్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎ.కొండూరు ప్రధాన కూడలిలోనూ వర్ధంతి నిర్వహించారు. విస్సన్నపేట అంబేడ్కర్‌ కూడలిలో బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు సభ్యులు హాజరయ్యారు.గంపలగూడెం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. - న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్‌, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, కైకలూరు, కైకలూరుగ్రామీణ, ముదినేపల్లి, మండవల్లి, కలిదింది, తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట


తిరువూరులో తెదేపా నాయకులు

బందరు: వైకాపా కార్యాలయంలో..

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని