logo

మహిళలను అగౌరవపరచడం అనైతికం

మహిళలను అగౌరపరిచే వారిని మళ్లీ శాసనసభలోకి రానివ్వకుండా తగు రీతిలో బుద్ధి చెప్పాలని పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ పిలుపునిచ్చారు. సోమవారం మల్లవోలు, ఐదుగుళ్లపల్లి గ్రామాల్లో మహిళల ఆత్మగౌరవ సభలు నిర్వహించారు.

Published : 07 Dec 2021 02:25 IST

మాట్లాడుతున్న తెదేపా నాయకుడు కృష్ణప్రసాద్‌

మల్లవోలు (గూడూరు), న్యూస్‌టుడే: మహిళలను అగౌరపరిచే వారిని మళ్లీ శాసనసభలోకి రానివ్వకుండా తగు రీతిలో బుద్ధి చెప్పాలని పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ పిలుపునిచ్చారు. సోమవారం మల్లవోలు, ఐదుగుళ్లపల్లి గ్రామాల్లో మహిళల ఆత్మగౌరవ సభలు నిర్వహించారు. అసభ్యకర వ్యాఖ్యలతో శాసనసభ ప్రతిష్ఠను దిగజార్చుతున్న వైకాపా నాయకుల తీరు గర్హనీయమన్నారు. తెలుగు ప్రజలు అందరూ వారి తీరును తప్పుపడుతూ ఖండిస్తున్నారని పేర్కొన్నారు. పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ విమర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి కరుణజ్యోతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని