logo

విద్యార్థుల ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విస్సన్నపేటలో సోమవారం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విస్సన్నపేట ప్రధాన రహదారిలో ప్రదర్శన నిర్వహించి, రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సంఘం జిల్లా నాయకుడు

Published : 07 Dec 2021 02:25 IST

విస్సన్నపేట, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విస్సన్నపేటలో సోమవారం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విస్సన్నపేట ప్రధాన రహదారిలో ప్రదర్శన నిర్వహించి, రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సంఘం జిల్లా నాయకుడు బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో.నెం.77ను వెంటనే రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులకు గత ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెనను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఎం.అశోక్‌, వి.నాగరాజు, గంగరాజు, కార్తీక్‌, సునీల్‌, రవితేజ, చంద్రశేఖర్‌, కిశోర్‌, స్రవంతి, రాజేశ్వరి, దివ్య తదితరులు పాల్గొన్నారు.

హామీ నెరవేర్చండి

తిరువూరు, న్యూస్‌టుడే: సీపీఎస్‌కు సంబంధించి ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ విషయంలో మాట తప్పవద్దని, మడమ తిప్పవద్దని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీను తెలిపారు. పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదును సోమవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈనెల 10న మీ హామీ-మా హక్కు పేరిట ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపడుతున్న చలో విజయవాడ సింహగర్జన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి, ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. నాయకులు జె.మురళీకృష్ణ, ఎస్‌.లక్ష్మణ్‌రాజు, పీవీ రావు, ఎంఆర్‌కే మూర్తి, బి.ప్రవీణ్‌, ఎస్‌.జగన్మోహనరావు, జి.శ్రీనివాసరావు, జి.కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులతో కలిసి గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న

పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను, ఇతర సభ్యులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు