logo

ఇదే స్ఫూర్తి కొనసాగించాలి: ఎస్పీ

అర్ధరాత్రి సమయంలో మహిళననే సంకోచం లేకుండా ముగ్గురు నిందితులను ధైర్యంగా పట్టుకొన్న మహిళా కానిస్టేబుల్‌ టి.శివకుమారిని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ ప్రశంసించారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై రాత్రి 11.45 గంటల సమయంలో

Published : 07 Dec 2021 02:25 IST

మహిళా కానిస్టేబుల్‌కు నగదు రివార్డు అందజేత

శివకుమారికి ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: అర్ధరాత్రి సమయంలో మహిళననే సంకోచం లేకుండా ముగ్గురు నిందితులను ధైర్యంగా పట్టుకొన్న మహిళా కానిస్టేబుల్‌ టి.శివకుమారిని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ ప్రశంసించారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై రాత్రి 11.45 గంటల సమయంలో ఓ లారీ డ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగదు, ఫోన్‌, తదితరాలను అపహరించుకువెళ్లారు. బాధితుడు వెంటనే ఈ విషయాన్ని డయల్‌-100 ద్వారా తెలియజేయగా ఆ సమాచారం అందుకున్న శివకుమారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రహదారిపై సెంట్రీ విధులు నిర్వహిస్తుండగా అనుమానాస్పద రీతిలో ఒక స్కూటీపై ముగ్గురు యువకులు వస్తుండటాన్ని గమనించి అడ్డుకున్నారు. బండి తాళాన్ని తీసుకుని సెల్‌ఫోన్‌లో వారి ఫొటోలు తీసి సీఐ నాగేంద్రకుమార్‌కు పంపించారు. వారే నిందితులుగా లారీ డ్రైవర్‌ గుర్తుపట్టడంతో వెంటనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యహరించిన ఆమెకు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ వీక్లీ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డుతో పాటు నగదు రివార్డును అందజేశారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి శాఖకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.

ఫిర్యాదుల స్వీకరణ: రోజూ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వచ్చిన వారి నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. కూచిపూడికి చెందిన వివాహిత భర్త ఆగడాలపై, కృత్తివెన్నుకు చెందిన వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాల్సిన బాకీదారుడు బెదిరిస్తున్నాడని, కైకలూరుకు చెందిన వృద్ధుడు ఆస్తి కోసం కుమారుడు వేధిస్తున్నాడని, మరికొందరు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఫిర్యాదులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని