logo

ఆర్బీకేలలో అవగాహన కార్యక్రమాలు

జిల్లాలోని అన్ని రైతుభరోసా కేంద్రాల్లో(ఆర్బీకే) మంగళవారం రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జేసీ కె.మాధవీలత మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో

Published : 07 Dec 2021 02:25 IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జేసీలు మాధవీలత, నుపూర్‌ శ్రీవాస్‌ తదితరులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని రైతుభరోసా కేంద్రాల్లో(ఆర్బీకే) మంగళవారం రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జేసీ కె.మాధవీలత మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జేసీ వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కల్పించవద్దని చెప్పారు. జేసీ ఎల్‌.శివశంకర్‌ మాట్లాడుతూ మండలాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని, ప్రతి శుక్రవారం ప్రత్యేక అధికారులు పురోగతిని సమీక్షించాలని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 971 చెత్త సంపద కేంద్రాలు నూరు శాతం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ నుపూర్‌శ్రీవాస్‌ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ శాశ్వత గృహహక్కు పథక అమలు వేగవంతం చేయాలని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మచిలీపట్నం శివగంగ ప్రాంతంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిని ప్రజలకు ప్రాణాంతకంగా మారాయని, తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కె.శివరామప్రసాద్‌, నాంచారయ్య, తదితరులు వినతిపత్రం అందజేశారు. మాచవరం ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలు జంపాని లావణ్య తనకు రూ.5వేలు పింఛనుగా ఇచ్చేవారని గత మూడు నెలలుగా రూ.3వేలు మాత్రమే ఇస్తున్నారని తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కైకలూరు మండలం కొల్లేటి, వడ్లపూడితిప్ప గ్రామాల్లో ఓటీఎస్‌ జాబితాలో 36 గృహాలు వచ్చాయని, తాము ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం చెల్లిస్తామని, ఇళ్లను ప్లస్‌-5 కాంటూరు పరిధి నుంచి మినహాయించాలని సర్పంచి, గ్రామస్థులు అర్జీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని