logo

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలి

ప్రభుత్వాసుపత్రుల ద్వారా అందించే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కల్పించేలా వైద్యులు తగు చొరవ తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ

Published : 07 Dec 2021 02:25 IST

మంత్రి పేర్ని నాని

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని ,

వేదికపై కలెక్టర్‌ నివాస్‌, ఇతర అధికారులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ప్రభుత్వాసుపత్రుల ద్వారా అందించే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కల్పించేలా వైద్యులు తగు చొరవ తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రితో పాటు కమిటీ ఛైర్మన్‌ హోదాలో కలెక్టర్‌ జె.నివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే పేదలకు తక్షణ వైద్య సేవలు అందించేలా కమిటీ సభ్యులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు శస్త్రచికిత్స అవసరం అయితే ఏడాదిలో రూ.2 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ పథకం నుంచి వినియోగించుకోవచ్చన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులుగా నూతనంగా నియమితులైన చలమలశెట్టి గాంధీ, చీలి రవీంద్ర, నిమ్మగడ్డ సత్యప్రకాష్‌, ఉరిటి రాంబాబులను పరిచయం చేస్తూ వారికి తగు తోడ్పాటు అందించాలని చెప్పారు. కలెక్టర్‌ నివాస్‌ ఆస్పత్రిలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు.. ఓపీ, రోగుల డిశ్ఛార్జి, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్‌ సిబ్బంది తక్కువగా ఉన్నందున వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ చెప్పగా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మచిలీపట్నంతో పోలిస్తే ఎక్కువమంది నర్సింగ్‌ సిబ్బంది ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.జయకుమార్‌ చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఏలూరులో కార్డియాలజీ, న్యూరో విభాగాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించి ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలల్లో చదివే విద్యార్థుల సేవలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చిలకలపూడి సీఐ అంకబాబు చెప్పారు. డెంటల్‌ సివిల్‌ సర్జన్‌ను, మత్తు వైద్యునికి సహాయకుడిని కాంట్రాక్టు పద్ధతిపై నియమించుకోవాలని మంత్రి సూచించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డులను సందర్శించిన మంత్రి, కలెక్టర్‌ రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. జేసీ శివశంకర్‌, డీఎంహెచ్‌వో డా.సుహాసిని, డీసీహెచ్‌ఎస్‌ డా.జ్యోతిర్మణి, ఆర్డీవో ఖాజావలి, ఆర్‌ఎంవో అల్లాడ శ్రీనివాసరావు, మేయర్‌ వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, ఆయా విభాగాల వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు.

ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వార్డును కలెక్టర్‌ పరిశీలించారు. బెడ్‌ల ఏర్పాటు, టాయిలెట్ల నిర్వహణపై ఆరా తీశారు. వెంటిలేషన్‌ సరిగా లేదని వెంటిలేటర్లు మార్చాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని