logo

సందడిగా కృష్ణాతీరం

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. భవానీపురంలోని హరితబరంపార్కు, కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ద్వీపంలో సంబరాలను నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు

Published : 17 Jan 2022 02:06 IST

బోటు షికారుకు టికెట్లు తీసుకునేందుకు బారులు తీరిన సందర్శకులు

భవానీపురం, న్యూస్‌టుడే: ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. భవానీపురంలోని హరితబరంపార్కు, కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ద్వీపంలో సంబరాలను నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. సందర్శకులతో కృష్ణా నదీతీరం సందడిగా మారింది. సంక్రాంతి పర్వదినం రోజైన శనివారం శాస్త్రీయ, జానపద నృత్య పోటీలను బరంపార్కులో నిర్వహించారు. సప్పా శివకుమార్‌ శిష్య బృందం జానపద నృత్యాలు, చింతా రవిబాలకృష్ణ కూచిపూడి నృత్యం, మావులూరి త్రినాథ్‌ శిష్య బృందం జానపద నృత్యాలు, సౌమ్య శిష్య బృందం నృత్యాలు అలరించాయి. విశ్వ శిష్యుల వెస్ట్రన్‌ నృత్యాలు అలరించాయి. గ్రంథి వెంకటపేరయ్య, గాళం ఏడుకొండలు కోలాటం ఆకట్టుకున్నాయి. భవానీ ద్వీపంలో జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగంలో పాటల పోటీలు జరిగాయి. చిన్నారులు ఆ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని గీతాలను ఆలపించారు. కళాకారిణి కరగం ధరించి చేసిన నృత్యం ఆకట్టుకుంది. చెర్రీ అనే చిన్నారి డ్రమ్స్‌ వాయించి ఆకట్టుకున్నాడు. వంటల పోటీలను నిర్వహించగా సంక్రాంతి పిండి వంటలతో పాటు వివిధ రకాల వంటకాలను చేసి మహిళలు తీసుకొచ్చారు. కనుమ రోజైన ఆదివారం మధ్యాహ్నం హరితబరం పార్కులో సంప్రదాయ వస్త్రాలను ధరించి ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. విజేతలకు బహుమతులను అందజేశారు.బోటు షికారు చేసేందుకు సందర్శకులు క్యూ కట్టారు. పర్యాటకశాఖ ఎండీ సత్యనారాయణ, జీఎం హరినాథ్‌, జీఎం(ఫైనాన్స్‌) విశ్వనాథన్‌, డీవీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని