logo

పాఠశాలల అభివృద్ధికి ప్రణాళిక

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్రశిక్ష ద్వారా ఏటా నిధులు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి ప్రణాళిక సిద్ధం చేయాలంటూ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా తయారు చేసే

Published : 17 Jan 2022 02:06 IST

మచిలీపట్నం(చిలకలపూడి),న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్రశిక్ష ద్వారా ఏటా నిధులు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి ప్రణాళిక సిద్ధం చేయాలంటూ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా తయారు చేసే ప్రణాళికనుబట్టి ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేస్తుంది.

ఎన్ని నిధులు అవసరం

జిల్లా వ్యాప్తంగా 2,800 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 3.60లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మౌలిక వసతుల దగ్గర నుంచి వారికి అందించే సదుపాయాల వరకు ఎంత ఖర్చవుతుందో లెక్కగట్టి ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను బట్టి నిధుల కేటాయింపు ఉంటుంది. దీనికి ముందే అధికారులు ఉపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం కొవిడ్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌లోనే వివరించి దానికి సంబంధించిన ప్రొఫార్మాలు అందజేశారు. పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులు అందులో ఉన్న అంశాల వారీగా వివరాలు నమోదు చేసి ఎంఈవోకి అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సేకరించిన సమాచారాన్ని బట్టి వారు మండలస్థాయి ప్రణాళిక తయారు చేసి జిల్లాకు అందించాలి. అలా తయారు చేసిన పాఠశాల, మండల, జిల్లాస్థాయి ప్రణాళికలు రాష్ట్రానికి అందించాలి. విద్యార్థుల సంఖ్య, అవసరమైన భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీలు, క్రీడా పరికాలు, ఉపాధ్యాయుల టీఎల్‌ఎం, దుస్తులు, పుస్తకాలు, దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు, వారికి అందించే వివిధ ప్రోత్సాహకాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఇలా ఏఅంశాన్ని వదలకుండా పూర్తిస్థాయిలో ప్రణాళిక తయారు చేయాలని అధికారులు ఆదేశించారు. సమగ్రశిక్షలో ఉన్న అన్నివిభాగాల వారీగా ప్రణాళిక తయారు చేయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీసీ శేఖర్‌ తెలిపారు. ఫిబ్రవరి 15లోగా జిల్లాస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉందని త్వరితగతిన ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఎంఈవోలను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని