logo

సుజలధారలేవీ?

గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, సుజలధార పేరుతో పథకాన్ని ప్రారంభించి పలుచోట్ల శుద్ధ జల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి నామమాత్రపు రుసుము వసూలు చేసి

Published : 17 Jan 2022 02:06 IST

ఆటపాకలోని తాగునీటి పథకం

ఆటపాక (కైకలూరు), న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, సుజలధార పేరుతో పథకాన్ని ప్రారంభించి పలుచోట్ల శుద్ధ జల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి నామమాత్రపు రుసుము వసూలు చేసి నీటిని విక్రయించేవారు. రూ.లక్షలు వెచ్చించి ప్రజావసరాల కోసం నిర్మించిన ఆ కేంద్రాలు ఇప్పుడు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఆటపాకలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజలధార తాగునీటి శుద్ధ జల కేంద్రాన్ని 2017లో అప్పటి రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌ ప్రారంభించారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.6.14 లక్షల వ్యయంతో నిర్మించారు. కొన్ని నెలలు సవ్యంగానే నడిచిన పథకం ప్రస్తుతం నిర్వహణ కొరవడి అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో గ్రామస్థులు ప్రైవేటు శుద్ధ జల కేంద్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలోని రూ.లక్షల విలువైన యంత్ర సామగ్రి పాడైపోతుంది. అధికారులు ఈ పథకాన్ని పునః ప్రారంభించి తాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని