logo

చంద్రశేఖరశాస్త్రి సేవలు చిరస్మరణీయం

చంద్రశేఖర శాస్త్రి సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని హిందూ ధర్మ పరిరక్షణ వేదిక కార్యాలయంలో ఆదివారం ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌

Published : 17 Jan 2022 02:06 IST

సంతాప సభలో బాబాప్రసాదు, హిందూ ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు

మచిలీపట్నం(చిలకలపూడి),న్యూస్‌టుడే: చంద్రశేఖర శాస్త్రి సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని హిందూ ధర్మ పరిరక్షణ వేదిక కార్యాలయంలో ఆదివారం ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ఎం.బాబాప్రసాదు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు మల్లాది చేసిన సేవలను కొనియాడారు. ధర్మ సందేహాలు తీర్చడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు ఏఆర్‌కే మూర్తి మాట్లాడుతూ తెలుగునాట రామాయణం, భారతం, భాగవత ప్రవచనాలకు చంద్రశేఖరశాస్త్రి పెట్టింది పేరని అన్నారు. వేదిక సభ్యులు ఎం. సుబ్రహ్మణ్యం, ఎ. విశ్వేశ్వరశాస్త్రి, పీవీ ఫణికుమార్‌, ఎ.సుబ్రహ్మణ్యం, కె.రఘు, పి.పాండురంగచడగ, విజయనాథ్‌, ఎం.నరసింహారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు