logo

అడ్డొచ్చిన పశువులు..

మండలంలో తక్కెళ్లపాడు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన దాసరి పృథ్విరాజ్‌ (31) దుర్మరణం చెందాడు. కూలి పనిచేస్తూ జీవనం సాగించే ఇతను శనివారం రాత్రి ఓ పనిమీద వెళ్లి పులపర్రు వైపు నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా

Published : 17 Jan 2022 02:06 IST

అదుపు తప్పి పడి యువకుడి దుర్మరణం

పృథ్వీరాజ్‌(పాతచిత్రం)

మండవల్లి, న్యూస్‌టుడే: మండలంలో తక్కెళ్లపాడు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన దాసరి పృథ్విరాజ్‌ (31) దుర్మరణం చెందాడు. కూలి పనిచేస్తూ జీవనం సాగించే ఇతను శనివారం రాత్రి ఓ పనిమీద వెళ్లి పులపర్రు వైపు నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా రహదారిపై పశువులు అడ్డు రావడంతో అదుపుతప్పి రోడ్డుపై జారిపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కైకలూరు సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండగ రోజే యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.

మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు

ఎమ్మెల్యే పరామర్శ

కైకలూరు గ్రామీణం: రహదారి ప్రమాదంలో మృతిచెందిన పృథ్విరాజు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. అతని మృతదేహానికి కైకలూరు సీహెచ్‌సీలో పంచనామా నిర్వహించటం ఆలస్యం కావటంతో ఎమ్మెల్యే ఆసుపత్రి వద్దకు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్టుమార్టంలో జాప్యంపై రెవెన్యూ, పోలీసు, వైద్యాధికారులతో మాట్లాడారు. వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆటపాకలో తోట రాకేశ్‌కుమార్‌ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బావిశెట్టి నాగేశ్వరరావు, సింగంశెట్టి రాము, కన్న సాంబయ్య, రమేశ్‌, దాసరి ప్రసాద్‌ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ..

చౌటుప్పల్‌గ్రామీణం: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం క్రాస్‌ రోడ్డు వద్ద ఇన్నోవా కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... మచిలీపట్నం డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగ ఇది జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన చిప్ప సాయి పృథ్వీరాజ్‌(23), జవహర్‌ నగర్‌ వాసి వనబోజు చందు(28) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదురుగు గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు