logo

ఉసురు తీసిన పతంగం సరదా

గాలిపటం ఎగుర వేసేందుకు డాబా పైకి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందిన ఘటన విద్యాధరపురం చెరువు సెంటర్‌ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోలా వెంకటరమణమూర్తి

Published : 18 Jan 2022 01:15 IST

భవానీపురం, న్యూస్‌టుడే : గాలిపటం ఎగుర వేసేందుకు డాబా పైకి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందిన ఘటన విద్యాధరపురం చెరువు సెంటర్‌ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోలా వెంకటరమణమూర్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కుమారుడు ఫణీంద్ర, కుమార్తె ఉన్నారు. ఫణీంద్ర(16) స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గాలిపటం ఎగురవేసేందుకు వారు అద్దెకు ఉంటున్న భవనం పైకి ఫణీంద్ర ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో వెళ్లాడు. తర్వాత కుమారుడి గురించి తండ్రి ఆరా తీశాడు. గాలిపటం ఎగురవేసేందుకు డాబా పైకి వెళ్లినట్లు భార్య చెప్పింది. కొద్దిసేపటి తర్వాత కుమారుడిని పిలవగా పలకలేదు. అనుమానం వచ్చి పైకి వెళ్లి చూడగా చీకట్లో కింద పడిపోయి కనిపించాడు. కుమారుడి వద్దకు వెళ్లి చూడగా తలకు గాయంతో కనిపించాడు. వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు చెప్పారు. విద్యుత్తు తీగలకు ఇరుక్కున్న గాలిపటాన్ని తీసే క్రమంలో కింద పడిపోయి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సోమవారం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని