logo

మూడోదశనూ సమర్థంగా ఎదుర్కొందాం

కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండటంతోపాటు అన్ని వసతులూ సిద్ధం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని వైద్యులకు సూచించారు. సోమవారం ఆయన జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ మూడోదశ సంసిద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 18 Jan 2022 01:27 IST

వైద్యులతో మంత్రి పేర్ని నాని

వైద్యాధికారులతో మాట్లాడుతున్న మంత్రి పేర్ని

మచిలీపట్నంకార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండటంతోపాటు అన్ని వసతులూ సిద్ధం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని వైద్యులకు సూచించారు. సోమవారం ఆయన జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ మూడోదశ సంసిద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఒకటి, రెండు దశల్లో జిల్లాలో సమర్థవంతంగా వైద్యసేవలు అందించామని, మూడోదశలో కూడా అదేవిధంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్పత్రికి ఎలక్ట్రోలైట్‌ బ్లడ్‌ అనలైజర్‌ అవసరమని అధికారులు చెప్పగా అందుకు అవసరమైన రూ.2లక్షలు తానే ఇస్తానని, వెంటనే తెప్పించుకోవాలని మంత్రి హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో కొవిడ్‌ రోగుల గురించి ఆరాతీసిన తరువాత మంత్రి మాట్లాడుతూ రెండు రోజుల్లో రోజుకు 10 కేసుల చొప్పున జిల్లా ఆసుపత్రిలో నమోదయ్యాయని, కొవిడ్‌సోకిన వారు ఇప్పటివరకు 23మంది చేరితే అందులో ఇద్దరు మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకోనివారు ఉన్నారని చెప్పారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఒకరికి మాత్రమే ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉందని అన్నారు. అయినా అందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఒమిక్రాన్‌ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాలని మంత్రి వైద్యుడు జగదీష్‌ను అడగ్గా బాగా అలసట, కొద్దిపాటి కండరాలనొప్పి, గొంతులో గరగర, పొడిదగ్గు, తక్కువమందిలో కొద్దిపాటి జ్వరం ఉంటుందని చెప్పారు. ఆర్డీవో ఖాజావలి, డీఎంహెచ్‌వో డా.సుహాసిని, డీసీహెచ్‌ఎస్‌ డా.జ్యోతిర్మణి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జయకుమార్‌, ఆర్‌ఎంవో మల్లికార్జునరావు, ఏవో డా.అల్లాడ శ్రీనివాసరావు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని