logo

జిల్లాకు ట్రైనీ ఐపీఎస్‌

ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌(ఐపీఎస్‌)కు ఎంపికైన అడహల్లి జగదీష్‌ 29 వారాల ప్రాథమిక శిక్షణ నిమిత్తం జిల్లాకు వచ్చారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఆయన ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ

Published : 18 Jan 2022 01:27 IST

ఎస్పీని కలిసిన జగదీష్‌

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌(ఐపీఎస్‌)కు ఎంపికైన అడహల్లి జగదీష్‌ 29 వారాల ప్రాథమిక శిక్షణ నిమిత్తం జిల్లాకు వచ్చారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఆయన ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల పనితీరు, పరిపాలన, ఏయే విభాగాలు ఏవిధంగా పనిచేస్తాయి, తదితర అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని ఆయనకు సూచించారు.

స్పందనలో ఫిర్యాదుల స్వీకరణ : రోజూ స్పందనలో భాగంగా జిల్లా వివిధ ప్రాంతాల నుంచి సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వచ్చిన వారి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. మచిలీపట్నం, పామర్రు, ఘంటసాల, తదితర ప్రాంతాలకు చెందిన వారు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆయన ఆయా ఫిర్యాదులను విచారించి చట్టపరిధిలో తగు న్యాయం చేయాలంటూ సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని