logo

క్రీడా కోటాలో 27 మందికి నియామక ఉత్తర్వులు

మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో క్రీడా కోటా ద్వారా వార్డు సచివాలయ ఉద్యోగులుగా 27 మందికి నియామక ఉత్తర్వులను జేసీ కె.మాధవీలత అందజేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జేసీ వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ

Published : 18 Jan 2022 01:27 IST

నియామకపత్రం అందజేస్తున్న జేసీ మాధవీలత,

పక్కన జేసీ మోహన్‌కుమార్, జడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు 

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో క్రీడా కోటా ద్వారా వార్డు సచివాలయ ఉద్యోగులుగా 27 మందికి నియామక ఉత్తర్వులను జేసీ కె.మాధవీలత అందజేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జేసీ వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. క్రీడా కోటా కింద నియమితులైన 3 ప్లానింగ్‌, 9 సంక్షేమ, 3 ఎమినిటీస్‌, 9 పారిశుద్ధ్య, 3 డేటా ప్రాసెసింగ్‌, విద్యా విభాగాలకు కార్యదర్శుల నియామకాలకు సంబంధించిన ఆదేశాలను వారికి అందజేసి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వారికి సూచించారు. అనంతరం స్పందన అర్జీ పరిష్కారంపై సమీక్షిస్తూ గడువు దాటిన అర్జీలను రీఓపెన్‌ చేసి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని, పాలవెల్లువ పథకం ప్రగతి సాధనకు వచ్చే బుధవారం 9 మండలాల పరిధిలో పాలసంఘాల వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రైతులకు తగు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ కోసం సంబంధిత అధికారులు వివరాలు పంపి వాటిని అప్‌లోడ్‌ చేయాలన్నారు. గ్రామ సర్వేయర్లు, వైద్యారోగ్యశాఖ, విద్యుత్తు శాఖలకు సంబంధించిన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ఫైల్స్‌ ఆన్‌లైన్‌లో జీరో చూపిస్తున్నాయని, వాటిని తక్షణం పంపాలని ఆదేశించారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్క్‌ ధారణ తప్పనిసరి చేయాలని, శానిటైజేషన్‌పై దృష్టి సారించాలని చెప్పారు. ఆమెతో పాటు జేసీ(ఆసరా) మోహన్‌కుమార్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, తదితర అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సామూహిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని