logo

కొంకేపూడిలో కొవిడ్‌ కేర్‌ కేంద్రం

మచిలీపట్నం-గుడివాడ ప్రధాన రహదారిపై కొంకేపూడి వద్ద అస్సిసీ ఆసుపత్రిలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జె.రామనాథం చెప్పారు. సోమవారం ఈ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీడీవో ఇక్కడ రోగులకు కల్పించిన సదుపాయాలపై వైద్యాధికారులతో

Published : 18 Jan 2022 01:27 IST

కేంద్రంలో సదుపాయాలపై సమీక్షిస్తున్న ఎంపీడీవో రామనాథం

పెడన, న్యూస్‌టుడే: మచిలీపట్నం-గుడివాడ ప్రధాన రహదారిపై కొంకేపూడి వద్ద అస్సిసీ ఆసుపత్రిలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జె.రామనాథం చెప్పారు. సోమవారం ఈ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీడీవో ఇక్కడ రోగులకు కల్పించిన సదుపాయాలపై వైద్యాధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఎంపీడీవో విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం 28 పడకలను ఇక్కడ సిద్ధంచేశామని, 50 వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఐదు ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వైద్యశాలలో చికిత్స అవసరమైన రోగులను ఈ కేంద్రంలో చేర్చుకొని, పూర్తి ఉచితంగా చికిత్స, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. మొత్తం ముగ్గురు వైద్యులను మూడు షిప్టుల్లో ఇక్కడ విధుల్లో నియమించామని తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే మొదటి షిప్టులో పెదతుమ్మిడి పీహెచ్‌సీ వైద్యాధికారిణి డా.సువర్చల, మధ్యాహ్నం 2గంటలకు మొదలయ్యే రెండో షిప్టులో బంటుమిల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డా.కె.స్వరూప, రాత్రి 8గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 8గంటల వరకు పెడన పీహెచ్‌సీ వైద్యాధికారి డా.పి.శివనాగరాజు విధులు నిర్వర్తిస్తారని వివరించారు. వైద్యులకు సహాయంగా ఒక స్టాఫ్‌ నర్స్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లు ఉంటారని ఎంపీడీవో చెప్పారు.

అవగాహన ర్యాలీ

మండవల్లి: మండంలోని అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ఎంపీడీవో శేషగిరిరావు నోమాస్క్‌ నో ఎంట్రీ, నోమాస్క్‌ నో రైడ్‌ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు.

ప్రచారంలో అధికారులు, సిబ్బంది​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని