logo

కౌలు రైతు ఆత్మహత్యపై విచారణ

అప్పుల బాధలు తాళలేక ఈనెల 2వ తేదీన మండలంలోని దేవరపల్లి గ్రామంలో బలవన్మరణానికి పాల్పడిన కౌలురైతు పాము నందియ్య(52) కుటుంబ సభ్యులను మచిలీపట్నం ఆర్డీవో ఎస్‌కే ఖాజావలి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు

Published : 18 Jan 2022 01:27 IST

బాధిత రైతు కుటుంబాన్ని విచారిస్తున్న ఆర్డీవో ఖాజావలి,

డీఎస్పీ షేక్‌ మాసుంబాషా తదితరులు

పెడన, న్యూస్‌టుడే: అప్పుల బాధలు తాళలేక ఈనెల 2వ తేదీన మండలంలోని దేవరపల్లి గ్రామంలో బలవన్మరణానికి పాల్పడిన కౌలురైతు పాము నందియ్య(52) కుటుంబ సభ్యులను మచిలీపట్నం ఆర్డీవో ఎస్‌కే ఖాజావలి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను భార్య పాము మాతాను అడిగి తెలుసుకున్నారు. గత నాలుగేళ్లుగా వరి సాగులో నష్టాలను ఎదుర్కొంటున్నామని, ఒక పక్క నష్టాలు మరో పక్క అప్పుల బాధ తాళలేక మనస్థాపంతో తమ భర్త బలవన్మరణానికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. పెళ్లీడుకు వచ్చిన ముగ్గురు ఆడపిల్లలను ఎలా మెట్టినింటికి పంపించాలన్న మనోవేదన కూడా తమ భర్తను వేధించిందని ఆమె వాపోయారు. భార్య ఇచ్చిన వాంగ్మూలాన్ని స్టేట్‌మెంట్‌ రూపంలో అధికారులు నమోదు చేసుకున్నారు. ఆర్డీవో వెంట మచిలీపట్నం డీఎస్పీ షేక్‌ మాసుంబాషా, వ్యవసాయశాఖ ఏడీ చింతల శ్రీనివాస్‌, ఎస్సై టి.మురళీ, ఏవో జీవీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ బత్తుల శివశంకర్‌ తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాలపై ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని