logo

ఈ రహదారిపై ప్రయాణం..ప్రమాదకరం

పెడన-బందరు మండలాలను అనుసంధానం చేసే రహదారి ఇది. పెడన మండలం నందమూరు నుంచి బందరు మండలం గోకవరం మీదుగా మంగినపూడి బీచ్‌ వరకు వెళ్లే 8.9 కిమీల ఈ బీటీ రోడ్డు కొన్నేళ్లుగా నిర్వహణకు నోచుకోవటంలేదు.

Published : 18 Jan 2022 01:27 IST

నందమూరు-మంగినపూడి బీచ్‌ రహదారి దుస్థితి

పెడన, న్యూస్‌టుడే: పెడన-బందరు మండలాలను అనుసంధానం చేసే రహదారి ఇది. పెడన మండలం నందమూరు నుంచి బందరు మండలం గోకవరం మీదుగా మంగినపూడి బీచ్‌ వరకు వెళ్లే 8.9 కిమీల ఈ బీటీ రోడ్డు కొన్నేళ్లుగా నిర్వహణకు నోచుకోవటంలేదు. ఫలితంగా అధ్వానంగా తయారై, ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నందమూరు ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంతో పాటు పలుచోట్ల రహదారికి సరిహద్దున కాలువ ఉండటంతో కోతకు గురవుతోంది. ఈ రహదారిపై ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ఆక్వా ఉత్పత్తులతో వెళ్లే వాహనాలు గణనీయంగా ఉంటాయి. మంగినపూడి బీచ్‌కు వెళ్లే పర్యాటకులు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారు. పంచాయతీరాజ్‌ ఆధీనంలోని ఈ రహదారి వెడల్పు 3.75 మీటర్లు కాగా ఇరువైపులా కోత కారణంగా వెడల్పు తగ్గిపోతోంది. రోడ్డు పునఃనిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నామని, నిధులు మంజూరైన అనంతరం పనులు ప్రారంభిస్తామని పంచాయతీరాజ్‌ పెడన మండల ఏఈఈ ఎల్‌.హరిబాబు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు