logo

మడ అడవులు కాపాడాలని వినతి

మండలంలోని ఇంతేరు గ్రామం భూబకాసురులకు అడ్డాగా మారిపోయిందని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాల్సిన అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని జనసేన నాయకుడు ఎస్‌.వి.బాబు సమ్మెట విమర్శించారు.

Published : 18 Jan 2022 01:27 IST

తహసీల్దార్‌ శశికుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న

జనసేన నాయకుడు బాబు సమ్మెట, ఇతర నేతలు

కృత్తివెన్ను, న్యూస్‌టుడే: మండలంలోని ఇంతేరు గ్రామం భూబకాసురులకు అడ్డాగా మారిపోయిందని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాల్సిన అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని జనసేన నాయకుడు ఎస్‌.వి.బాబు సమ్మెట విమర్శించారు. ఇంతేరులో మడ భూములు కాపాడాలని సోమవారం ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ శశికుమార్‌కు జనసేన నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మడ అడవులను చెరువులుగా తవ్వేశారని, సీఆర్‌జెడ్‌ నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శించారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు తిరుమాని రామాంజనేయులు, జిల్లా కార్యదర్శులు కూనసాని నాగబాబు, తిరుమలశెట్టి చంద్రమౌళి, రాష్ట్రమత్స్యకార విభాగ శాఖ కార్యదర్శి ఒడుగు ప్రభాస్‌రాజు, బంటుమిల్లి మండల అధ్యక్షుడు ఆర్‌.సత్యనారాయణ, కొప్పినీటి నరేష్‌, పట్టపు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని