logo

యుగపురుషుడు ఎన్టీఆర్

యుగపురుషుడు ఎన్టీఆర్ అని తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు దశదిశలా పెంపొందించటంలో ఎన్టీఆర్ అహర్నిశలు శ్రమించారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు

Updated : 18 Jan 2022 15:52 IST

ఘంటసాల: యుగపురుషుడు ఎన్టీఆర్ అని తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు దశదిశలా పెంపొందించటంలో ఎన్టీఆర్ అహర్నిశలు శ్రమించారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఘంటసాల, శ్రీకాకుళం, లంకపల్లి, గ్రామాల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పాపవినాశనం, కొడాలి, తాడేపల్లి తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెదేపా ఆధ్వర్యంలో పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, సర్పంచులు రవి ప్రసాద్, మురళి, అమరేశ్వర రావు, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్వరరావు, తెదేపా నేతలు వెంకట రామకృష్ణ, భాను ప్రకాష్, గోపీచంద్, సాయి వెంకట రమణ, నాగేశ్వరరావు, చలపతిరావు, రంగారావు, సురేష్, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని